‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరును అందుకే ఫిక్స్ చేశాం.. రాజమౌళి కామెంట్స్ వైరల్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన ప్రతి సినిమాకు కథను బట్టి టైటిల్స్ ను ఫిక్స్ చేస్తారనే సంగతి తెలిసిందే.అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన సినిమాకు మాత్రం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

 Interesting Facts About Ss Rajamouli Rrr Movie Title , Comments Viral, Interesti-TeluguStop.com

అయితే ఈ టైటిల్ ఫిక్స్ కావడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్ లో భాగంగా జక్కన్న చెప్పుకొచ్చారు.సినిమా మొదలుపెట్టే సమయంలో ఏ టైటిల్ పెట్టాలో తెలియదని ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ అనుకున్నామని ఆయన అన్నారు.

తాజాగా హిందీ షోలో పాల్గొన్న రాజమౌళి టైటిల్ ఏం పెట్టాలో క్లారిటీ లేకపోవడం వల్లే ముగ్గురి పేర్లు కలిసొచ్చేలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ ను ఫిక్స్ చేశామని అన్నారు.ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హ్యాష్ ట్యాగ్ తోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చామని జక్కన్న పేర్కొన్నారు.

ఆ తర్వాత తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల నుంచి సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని జక్కన్న అన్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండే అవకాశమే లేదని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

మన దేశ సంస్కృతితో పాటు విప్లవం, భావోద్వేగం సమ్మేళనం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అని రాజమౌళి అన్నారు.ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించడంతో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద ప్రాజెక్ట్ అయిందని జక్కన్న చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు ఇతర రాష్ట్రాలకు చెందిన టెక్నీషియన్స్ ఎక్కువగా పని చేశారని జక్కన్న కామెంట్లు చేశారు.

Telugu Rajamouli, Rrr-Movie

500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని బయ్యర్లు కోరారని సమాచారం.డీవీవీ దానయ్య 30 శాతం డిస్కౌంట్ కు అంగీకరించారని బోగట్టా.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube