సినిమా ఇండస్ట్రీలోకి శ్రీముఖి ఎలా వచ్చిందో తెలుసా..?

బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.వెండితెరకు, బుల్లితెరకు సమ ప్రాధాన్యత ఇస్తూ శ్రీముఖి సత్తా చాటుతున్నారు.

 Interesting Facts About Srimukhi Movies Entry-TeluguStop.com

జులాయి సినిమాతో శ్రీముఖి టాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే.అయితే మొదట్లో కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరించడంతో శ్రీముఖికి సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి.

సూపర్ సింగర్ 9, అదుర్స్ రియాలిటీ షోలకు శ్రీముఖి కెరీర్ తొలినాళ్లలో యాంకర్ గా వ్యవహరించారు.

 Interesting Facts About Srimukhi Movies Entry-సినిమా ఇండస్ట్రీలోకి శ్రీముఖి ఎలా వచ్చిందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షోలే శ్రీముఖికి సినిమా ఆఫర్లతో పాటు గుర్తింపు రావడానికి కారణమయ్యాయి.

జులాయి సినిమా తరువాత శ్రీముఖి నేను శైలజ సినిమాలో రామ్ చెల్లెలి పాత్రలో నటించారు.ఆ పాత్రలో శ్రీముఖి అద్భుతంగా నటించారు.ప్రేమ ఇష్క్ కాదల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మరికొన్ని సినిమాల్లో నటించి శ్రీముఖి సత్తా చాటారు.శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించగా త్వరలో ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

మిగతా షోలతో పోలితే ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమైనన్ పటాస్ షో శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచింది.రవితో కలిసి పటాస్ షో చేసిన శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ రావడంతో పటాస్ షోకు గుడ్ బై చెప్పారు.

బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడిన శ్రీముఖి ఆ షో విన్నర్ అవుతారని చాలామంది భావించినా ఆమె రన్నర్ గా నిలిచారు.రన్నర్ అయినప్పటికీ ఆమె ఆ షోకు పారితోషికం బాగానే తీసుకున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో తర్వాత కొన్ని నెలల పాటు సైలెంట్ గా ఉన్న శ్రీముఖి మళ్లీ వరుస షోలు ఈవెంట్లతో బిజీ అవుతున్నారు.వెండితెరపై ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం శ్రీముఖికి క్రేజ్ తో పాటు పారితోషికం పెరిగే అవకాశం ఉంది.

#Julayi #Crazy Uncles #Sreemukhi Shows

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు