చిరునవ్వు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు

చిరునవ్వులో ఉన్న అందం కొత్త బట్టలో, కాస్ట్లీ మేకప్ లో ఉండదు.అసలు మనిషి నవ్వుకన్నా అందమైన దృశ్యం ప్రపంచంలో లేదని ఊరికే అనరు కదా.

 Interesting Facts About Smile-TeluguStop.com

నవ్వుకి ఎందుకంత గొప్ప స్థానం ఇస్తారంటే, ఆ నవ్వు మిమల్ని ఇతరులు ప్రేమించగలిగేలా చేయగలదు అలాగే శతృవులని కూడా దగ్గరగా చేయగలదు.అలాంటి చిరునవ్వు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

* ఒక్క చిరునవ్వు కోసం 5-53 ముఖ కండరాలు పనిచేస్తాయట.మన నవ్వుని బట్టి కండరాలు ఎక్కువగా పనిచేయటం, తక్కువగా పనిచేయటం జరుగుతుంది.

* కొన్ని అధ్యయనాల ప్రకారం మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా చిరునవ్వులు చిందిస్తారట.కాస్త రఫ్ గా ఉండే గుణం వలన కావచ్చు, మగవారు తక్కువగా నవ్వుతారట.

అదీకాక అమ్మాయి నవ్వులో అందం వేరు కదా.అందుకే వారు వీలైనపుడల్లా నవ్వుతుంటారు.

* అతి త్వరగా, అతి దూరం నుంచి పసిగట్టగలిగే ముఖకవళిక నవ్వు.దాదాపు 300 ఫీట్ల దూరం నుంచి కూడా మనిషి ముఖంలో చిరునవ్వుని గుర్తించవచ్చు అంట.

* కేవలం దృశ్యం ద్వారా మనుషులు నవ్వరు.ఎందుకంటే అంధులకి కూడా నవ్వే శక్తి ఉంటుంది.

పుట్టుకతోనే నవ్వే ఎబిలిటితో మనిషులు పుడతారట.

* మేకప్ కన్నా, రంగుతేలిన చర్మం కన్నా, అమ్మాయి నవ్వుకి మగవారు ఎక్కువగా పడిపోతారట.

ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో సర్వేలు జరిగాయి.

* రోగనిరోధకశక్తి పెంచే శక్తి నవ్వులో ఉంటుందని పరిశోధకులు చెబుతారు.

అందుకే నవ్వు సర్వరోగనివారిణి అని అంటారు పెద్దలు.

* స్వచ్ఛమైన నవ్వులో స్ట్రెస్, ఒత్తిడి, అలసట, బద్ధకాన్ని పారద్రోలే బలం ఉంటుంది.

ఇది ఊరికే చెప్పటం కాదు, మన మెదడులో నవ్వు వలన జరిగే కెమికల్ రియాక్షన్స్ వలన ఇలా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube