నిద్ర గురించి మీకు తెలియని నిజాలు  

 • నిద్రలో ఏం జరుగుతోందో మనకు సాధారణంగా తెలియదు. అలాగే నిద్ర గురించి కూడా కొన్ని గమ్మత్తయిన నిజాలు తెలియకపోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.

 • * సాధారణంగా రాత్రిపూట నిద్రపట్టడానికి 10-15 నిమిషాలు పట్టాలి. అంతకంటే తక్కువ సమయంలో నిద్రపట్టేస్తే మీరు అలసిపోయారని అర్థం. ఆలస్యం జరుగితే మీకు నిద్ర రావట్లేదని అర్థం.

 • * ఒక పిల్లి జీవితంలో 2/3 భాగం నిద్రలోనే గడిచిపోతుందట.

 • * 264.4 గంటల పాటు నిద్రపోకుండా ఉన్నాడు ఓ హై స్కూలు స్టూడెంట్. ఇదో రికార్డు.

 • * పసికందులు ఎక్కువగా REM-SLEEP లో ఉంటారు.

 • * ఒక జిరాఫీకి రోజులో 1.9 గంటల నిద్ర మాత్రమే అవసరం. అదే ఒక బ్రౌన్ బ్యాట్ కి 19.9 గంటల నిద్ర అవసరం.

 • * ప్రపంచ జనాభాలో 15% మందికి నిద్రలో నడిచే అలవాటు ఉంది.

 • * నిద్రను వాయిదా వేయడం కేవలం మనుషులు చేయగలుగే పని.

 • * నిద్రలో కూడా కొంచెం యాక్టివ్ గా ఉండే మన మెదడు, ఆ సమయంలో టాక్సీన్స్ ని కూడా క్లియర్ చేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

 • * ఈ ప్రపంచంలో నిద్రలేమితో బాధపడేవారికన్నా, గురకతో ఇబ్బందిపడే వారి సంఖ్యే ఎక్కువ.

 • * మధ్యాహ్నం నిద్ర మంచిదే అయినా, గంట-గంటన్నరలో నిద్రను ముగించాలని పరిశోధకులు చెబుతారు.