సింగర్ హారికా నారాయణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలోని లాహే లాహే పాట ఎంత పెద్ద హిట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సింగర్ హారికా నారాయణ్ ఈ పాటను పాడారు.

 Interesting Unknown Facts About Singer Harika Narayan , Harika Narayan, Brahmots-TeluguStop.com

సినిమాలు, టీవీ షోలలో పాటలు పాడుతూ గుర్తింపును సంపాదించుకుంటున్న హారిక నారాయణ్ మొదట సింగర్ గా ఈటీవీ ఛానెల్ లో ప్రసారమైన స్వరాభిషేకం ద్వారా గుర్తింపును సంపాదించుకున్నారు.

చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉన్న హారికా నారాయణ్ కర్ణాటక సంగీతం నేర్చుకోవడంతో పాటు సంగీతంలో డిప్లొమా చేశారు.

సంగీతం విషయంలో అమ్మే తొలిగురువు అని హారికా నారాయణ్ చెబుతున్నారు.హారిక సంగీత విద్వాంసునిగా మంచి పేరును సంపాదించుకున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువు కావడం గమనార్హం.మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన హారిక జర్మనీకి వెళ్లాలని అనుకున్నా ఊహించని విధంగా సింగర్ గా మారారు.

Telugu Aachrya, Brahmotsavam, Chiranjeevi, Harika Yan, Laahe Laahe, Mahesh Babu,

పాడుతా తీయగా అడిషన్స్ లో పాల్గొన్న హారిక స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో కొన్ని పాటలు పాడారు.బ్లాక్ రోజ్, సూర్యకాంతం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలలోని పాటు హారికకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.ఒకవైపు సినిమాలలో పాటలు పాడుతూనే మరోవైపు స్పెషల్ ఆల్బమ్స్ సహాయంలో హారిక అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

మహేష్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా టైటిల్ ట్రాక్ ను హారిక పాడారు.

హారిక పలు సినిమాల్లో కూడా నటించారు.

ముకుంద, బ్రహ్మోత్సవం, సైరా సినిమాల్లో హారిక చిన్నచిన్న పాత్రల్లో కనిపించారు.బైక్ రైడింగ్ ను ఎంతో ఇష్టపడే హారిక కాలేజ్ కు బైక్ పైనే వెళ్లేవారని సమాచారం.

హారిక ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా మహేష్ బాబును దగ్గరినుంచి చూడవచ్చనే ఒక ఒక కారణంతో ఆమె బ్రహ్మోత్సవం సినిమాలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube