సావిత్రి ఇంట్లో బంగారం కొట్టేసిన వ్యక్తి అతనేనట.. అసలేం జరిగిందంటే?

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మహానటిగా సావిత్రి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.గుంటూరు జిల్లాలోని చిర్రావూరు గ్రామం నటి సావిత్రి యొక్క స్వస్థలం.

 Interesting Facts About Senior Star Heroine Savitri Details, Fraud Interesting F-TeluguStop.com

సావిత్రి ఆరు నెలల వయస్సులో ఉన్న సమయంలో ఆమె తండ్రి అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.సావిత్రికి పెదనాన్న అయిన వెంకట రామయ్య ప్రోత్సాహంతో సావిత్రి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.13 ఏళ్ల వయస్సులో సంసారం అనే సినిమాలో సావిత్రి అవకాశం పొంది కొన్ని కారణాల వల్ల తొలగింపబడ్డారు.

ఆ తర్వాత పాతాళ భైరవి మూవీలో సావిత్రి చిన్న పాత్రకు ఎంపిక కాగా ఆ పాత్ర సావిత్రికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత పెళ్లి చేసి చూడు సినిమాలో సావిత్రి సెకండ్ హీరోయిన్ గా నటించారు.సావిత్రి మాయాబజార్ సినిమాలో నటించిన తర్వాత ఆమెకు అవకాశాలు భారీగా పెరిగాయి.

సావిత్రి డైరెక్షన్ లో చిన్నారి పాపలు అనే మూవీ తెరకెక్కగా ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది.పూర్తిగా మహిళలతో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ కాలేదు.

క్రికెట్, చెస్ ను సావిత్రి ఎంతగానో ఇష్టపడతారు.

Telugu Chinnari Papalu, Sagar, Fraud, Patala Bhairavi, Savitri, Senior, Subraman

ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేసే విషయంలో సావిత్రి ముందువరసలో ఉంటారు.వరుస ఫ్లాపుల వల్ల సావిత్రి మానసికంగా బాధ పడటంతో ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నారు.దర్శకుడు సాగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సావిత్రి ఏ తప్పు చేయలేదని అన్నానగర్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండేవారని సాగర్ చెప్పారు.

Telugu Chinnari Papalu, Sagar, Fraud, Patala Bhairavi, Savitri, Senior, Subraman

సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సావిత్రిని మోసం చేశారని సింపతీ ఫేస్ తో ఆ వ్యక్తి ఉండటంతో సావిత్రి అతనిని నమ్మారని సాగర్ పేర్కొన్నారు.సుబ్రహ్మణ్యం మోసం చేసి సావిత్రితో సంతకాలు పెట్టించుకున్నారని సాగర్ వెల్లడించారు.డబ్బును జాగ్రత్త తీసుకుంటే మాత్రమే ఈ ఇండస్ట్రీలో జీవించగలమని సాగర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube