సీనియర్ హీరోయిన్ రాధిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు, తమిళ భాషల్లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా రాధికా శరత్ కుమార్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.రాడాన్ పిక్చర్స్ ను స్థాపించి సీరియల్స్ ను నిర్మించడం ద్వారా రాధిక పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Interesting Facts Of Senior Star Heroine  Radhika Sharat Kumar , Interesting Fac-TeluguStop.com

రాధిక పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు.తన సినీ కెరీర్ లో రాధిక ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటనతో మెప్పించి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు.

నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణించిన రాధిక ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.అందం, అభినయంతో తమిళంలో దాదాపు పది సంవత్సరాల పాటు రాధిక నంబర్ వన్ హీరోయిన్ స్థానంలో ఆమె కొనసాగారు.

ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగల రాధిక పలు సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం నటించి మెప్పించడం గమనార్హం.ఏ పాత్రలోనైనా తన మార్క్ ను చూపించే రాధిక కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించారు.

ప్రముఖ హాస్య నటుడు ఎం ఆర్ రాధ కూతురైన రాధికకు బాల్యంలో సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.

Telugu Kamal Hasan, Radhikasharat, Radhikasharath, Reality Show, Status, Swathim

అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస విజయాలతో పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం కావడంతో రాధిక సినిమాల్లో కొనసాగారు.తెలుగులో చిరంజీవికి జోడీగా రాధిక ఎక్కువ సినిమాల్లో నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విజయం సాధించడం గమనార్హం.

Telugu Kamal Hasan, Radhikasharat, Radhikasharath, Reality Show, Status, Swathim

కమల్, రాధిక కాంబోలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా రాధిక కెరీర్ కు ప్లస్ అయింది.హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాధిక పని చేశారు బుల్లితెరపై కూడా స్టార్ స్టేటస్ ను అందుకున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో రాధికా శరత్ కుమార్ ఒకరు.తన నటనతో రాధిక ఎన్నో అవార్డులు పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube