ఇంటికి వెళితే సీనియర్ ఎన్టీఆర్ ఆ పనులు చేసేవారట.. షాకింగ్ విషయాలు రివీల్!

సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అన్ని రకాల పాత్రల్లో నటించిన సీనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రల వల్ల క్రేజ్ ను, మార్కెట్ ను పెంచుకున్నారు.

 Interesting Facts About Senior Ntr Goes Viral Details, Jayakrishna Prasad, Senio-TeluguStop.com

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా సీనియర్ ఎన్టీఆర్ పరిమితంగా సినిమాలలో నటించారు.సీనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారనే సంగతి తెలిసిందే.

ఈ నెల 28వ తేదీనుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి.సీనియర్ ఎన్టీఆర్ బంధువు అయిన నందమూరి జయకృష్ణ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మా నాన్నగారు, సీనియర్ ఎన్టీఆర్ గారు స్నేహంగా ఉండేవారని తాను పదేళ్ల వయస్సులో ఉన్నప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ తెలుసని జయకృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Crop Works, Harikrishna, Nandamuri, Senior Ntr, Seniorntr, S

ఊరిలో ఎన్నికలకు సంబంధించిన పదవికి సీనియర్ ఎన్టీఆర్ నాన్న పోటీ చేస్తానని చెప్పగా మరో వ్యక్తి నుంచి పోటీ ఎదురు కావడంతో సీనియర్ ఎన్టీఆర్ జోక్యం చేసుకొని తన తండ్రిని పోటీ చేయవద్దని చెప్పారని జయకృష్ణ ప్రసాద్ వెల్లడించారు.ఊరిలో అందరూ కలిసి ఉండాలని ఆయన ఇలా చేశారని జయకృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ గుణమే వేరని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Crop Works, Harikrishna, Nandamuri, Senior Ntr, Seniorntr, S

మేము నందమూరి వంశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతమని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ వేసవికాలంలో పొలం వెళ్లి పనులు చేసేవారని ఆయన వెల్లడించారు.హరికృష్ణ మాతో ఆడుకునేవాడని నందమూరి కుటుంబం మనుషులపై ప్రేమ ఉన్న కుటుంబం అని ఆయన చెప్పుకొచ్చారు.బాలకృష్ణగారు కూడా ఆప్యాయంగా పలకరిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.మాకు సినిమా రంగం అంటే ఆసక్తి లేదని అందుకే వెళ్లలేదని ఆయన చెప్పారు.సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన గ్రామం అని నందమూరి కుటుంబానికి ఎంతో ప్రేమ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube