సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు.1942 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్, బసవతారకానికి పెళ్లి జరిగింది.ఈమె సీనియర్ ఎన్టీఆర్ మేనమామ కూతురు కావడం గమనార్హం.

 Interesting Facts About Senior Ntr First Wife Details, Senior Ntr, Basavatarakam-TeluguStop.com

బసవతారకం 1985 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం.

ఈ 12 మందిలో ఎనిమిది మంది కుమారులు కాగా నలుగురు కూతుళ్లు.సీనియర్ ఎన్టీఆర్ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం వెనుక బసవతారకం కృషి ఎంతో ఉంది.

సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లతో బిజీగా ఉండగా బసవతారకం పిల్లల పెంపకం బాధ్యతలను చూసుకున్నారు.బసవతారకం కృషి వల్లే బాలయ్య, హరికృష్ణ, రామకృష్ణ హీరోలు అయ్యారు.

తన కుటుంబ సభ్యులకు ఏ కష్టం రాకుండా బసవతారకం చూసుకున్నారు.సీనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా బసవతారకం ఎదురు వచ్చేవారు.

Telugu Balakrishna, Basavatarakam, Vv Raju, Hari Krishna, Rama Krishna, Senior N

దర్శకుడు వి.వి.రాజు మాట్లాడుతూ తారకమ్మ ఇంటికి వచ్చిన వాళ్లకు రుచికరమైన ఆహారం అందేలా చూసేవారని తెలిపారు.తారకమ్మ గారు అరుదుగా సెట్ కు వచ్చేవారని వి.వి.రాజు అన్నారు.తారకమ్మ తమను కొడుకులా చూసేవారని వి.వి.రాజు వెల్లడించారు.

Telugu Balakrishna, Basavatarakam, Vv Raju, Hari Krishna, Rama Krishna, Senior N

ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో తారకమ్మ చెప్పేవారని వి.వి.రాజు అన్నారు.సినిమా విషయంలో తారకమ్మ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదని ఆమె ఎన్నో గుప్తదానాలు చేశారని వి.వి.రాజు వెల్లడించారు.సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో భయమని వి.వి.రాజు పేర్కొన్నారు.పెళ్లి ఉన్నా ఫంక్షన్ ఉన్నా ఆమె సాయం చేసేవారని వి.వి.రాజు అన్నారు.తనకు కూడా తారకమ్మ ఒక సందర్భంలో ఆర్థిక సహాయం చేశారని వి.

వి.రాజు చెప్పుకొచ్చారు.తారకమ్మకు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడం తనకు తెలిసినంతవరకు ఇష్టం లేదని వి.వి.రాజు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube