సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్ మధ్య ఉన్న పోలికలు ఏంటో మీకు తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.తన నటనతో సీనియర్ ఎన్టీఆర్ కోట్ల సంఖ్యలో అభిమానులకు చేరువయ్యారు.

 Interesting Facts About Senior Ntr And Mgr , Interesting Facts ,  Senior Ntr , M-TeluguStop.com

అయితే కొన్ని విషయాలకు సంబంధించి ఎన్టీఆర్, ఎంజీఆర్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి.సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ మనదేశం మూవీతో మొదలైందనే సంగతి తెలిసిందే.

మనదేశం మూవీలో సీనియర్ ఎన్టీఆర్ ఎస్సై పాత్రలో నటించారు.ఎంజీఆర్ కూడా తన తొలి సినిమా లీలావతిలో ఎస్సై వేషమే వేశారు.

తమిళనాట ఎంజీఆర్ జానపద చిత్రాలలో ఎక్కువగా నటించగా తెలుగులో ఎన్టీఆర్ జానపద సినిమాలలో ఎక్కువగా నటించారు.శివుడు, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు లాంటి భక్తి పాత్రల ద్వారా ఎంజీఆర్ పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.

మాయా రంభ సినిమా ఎన్టీఆర్ తొలి సినిమా కాగా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలలో నటించారు.దాదాపుగా 40 సంవత్సరాల పాటు అటు ఎంజీఆర్ ఇటు ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు.

Telugu Cm Role, Kollywood, Potics, Senior Ntr, Tollywood-Movie

ఈ ఇద్దరు హీరోలు సినిమాల్లో నటించడంతో పాటు ప్రజలకు కష్టాలు వస్తే సహాయం చేసే విషయంలో ముందుండేవారు.ఈ ఇద్దరు హీరోలు నిజజీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.వయస్సులో ఎంజీఆర్ పెద్ద వ్యక్తి కావడంతో సీనియర్ ఎన్టీఆర్ ఆయనను అన్నా అని పిలిచేవారు.ఎంజీఆర్ ఎన్టీఆర్ ను తంబీ అని పిలిచేవారు.ఎన్టీఆర్ నటించిన సినిమాల రీమేక్ లో ఎంజీఆర్ నటించగా ఎంజీఆర్ నటించిన సినిమాల రీమేక్ లో ఎన్టీఆర్ నటించారు.

Telugu Cm Role, Kollywood, Potics, Senior Ntr, Tollywood-Movie

ఈ ఇద్దరు హీరోలు మాస్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నారు.ఎంజీఆర్, ఎన్టీఆర్ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించడం గమనార్హం.ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు.

సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సినిమాలలో కూడా నటించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube