బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన బాలయ్య, మహేష్, తరుణ్ సినిమాలు.. విన్నర్ ఎవరంటే?

Interesting Facts About Seemsimham Takkaridonga Nuvvuleka Nenulenu Movies

2022 సంవత్సరం సంక్రాంతి పండుగకు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ లో చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండగా రాధేశ్యామ్ లో ప్రభాస్, భీమ్లా నాయక్ లో పవన్ నటిస్తున్నారు.

 Interesting Facts About Seemsimham Takkaridonga Nuvvuleka Nenulenu Movies-TeluguStop.com

మూడు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా మూడు సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.అయితే ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

అయితే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2002లో బాలయ్య నటించిన సీమ సింహం, మహేష్ బాబు నటించిన టక్కరిదొంగ, తరుణ్ నటించిన నువ్వులేక నేనులేను సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి.ఈ మూడు సినిమాలలో నువ్వులేక నేనులేను సంక్రాంతి విజేతగా నిలిచింది.

 Interesting Facts About Seemsimham Takkaridonga Nuvvuleka Nenulenu Movies-బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన బాలయ్య, మహేష్, తరుణ్ సినిమాలు.. విన్నర్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరునవ్వుతో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన జి.రామ్ ప్రసాద్ కు రెండో సినిమాకే బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది.

ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇచ్చిన కథతో రామ్ ప్రసాద్ తెరకెక్కించిన సీమ సింహం సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

Telugu Bheemla Nayak, Chinni Krishna, Tharun, Mahesh Babu, Nuvvulekanenu, Radhe Shyam, Sankranthi, Seema Simham, Takkaridonga-Movie

ఓపెనింగ్స్ లో రికార్డులను సొంతం చేసుకున్న సీమ సింహం కథ, కథనంలోని లోపాల వల్ల ఫ్లాప్ అయింది.2002 సంవత్సరం జనవరి 11వ తేదీన సీమ సింహం విడుదలైంది.ఈ సినిమా రిలీజైన తర్వాత రోజున మహేష్ హీరోగా జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన టక్కరిదొంగ రిలీజైంది.

Telugu Bheemla Nayak, Chinni Krishna, Tharun, Mahesh Babu, Nuvvulekanenu, Radhe Shyam, Sankranthi, Seema Simham, Takkaridonga-Movie

ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది.అయితే సంక్రాంతి కానుకగా 2002 సంవత్సరం జనవరి 14వ తేదీన విడుదలైన నువ్వులేక నేనులేను పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కాశీ విశ్వనాథ్ నువ్వులేక నేనులేను సినిమాకు దర్శకత్వం వహించారు.బాలకృష్ణ, మహేష్ బాబులకు తరుణ్ షాక్ ఇవ్వడం గమనార్హం.సీమ సింహం, టక్కరి దొంగ సినిమాల ఫలితాలలో బాలకృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ నిరాశ చెందారు.

#NuvvulekaNenu #Bheemla Nayak #Chinni Krishna #Takkaridonga #Tharun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube