Saitej : అనాథ చిన్నారులకు చికిత్స.. సాయితేజ్ మంచి మనస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మంచి మనస్సు ఉన్న హీరోలలో సాయితేజ్( Saitej ) ఒకరు.విరూపాక్ష సినిమాతో హిట్ అందుకున్న సాయితేజ్ ప్రస్తుతం గాంజా శంకర్( Gaanja Shankar ) సినిమాలో నటిస్తున్నారు.

 Interesting Facts About Saitej Golden Heart Details Here Goes Viral In Social M-TeluguStop.com

ఈ సినిమా కొన్ని వివాదాలలో చిక్కుకోగా త్వరలో ఆ వివాదాలకు చెక్ పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే సాయితేజ్ తాజాగా చేసిన మంచి పని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

రెండు సంవత్సరాల క్రితం సాయితేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరిగింది.

ఆ ప్రమాదం వల్ల కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమైన సాయితేజ్ కోలుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటులలో సాయితేజ్ ఒకరు.సోషల్ సర్వీస్ లో( Social Service ) కూడా ముందువరసలో ఉంటూ సాయితేజ్ మంచి మనస్సును చాటుకుంటున్నాడు.

ఇద్దరు అనాథ చిన్నారుల వైద్య చికిత్స కోసం సాయితేజ్ సాయం చేసి ప్రశంసలు అందుకున్నారు.

అనాథ శరణాలయంలో( Orphan House ) ఉన్న ఇద్దరు చిన్నారుల చికిత్సకు సహాయం కావాలని సాయితేజ్ కు కాల్ రాగా సాయితేజ్ వెంటనే ఆ చిన్నారులకు ఆర్థికంగా సహాయం చేసి వైద్య చికిత్స అందేలా చూశారు.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు( Cinematographer Andrew Babu ) ఈ విషయాలను వెల్లడించారు.సాయితేజ్ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సాయితేజ్ ప్రస్తుతం 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.సాయితేజ్ కెరీర్ పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.సాయితేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గాంజా శంకర్ మూవీ సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube