సాయి పల్లవి చెల్లి ఎంత అందంగా ఉందో తెలుసా?

చేసింది తక్కువ సినిమాలే అయినా తన టాలెంట్ తో తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు.తనకు మాత్రమే సొంతమైన నటనతో సాయిపల్లవి అభిమానులను ఫిదా చేస్తూ ఉంటారు.

 Sai Pallavi Sister Pooja Kannan Debut Movie, Kaara A Ride For Love, Pooja Kannan-TeluguStop.com

అయితే సాయిపల్లవి గురించి, ఆమె వ్యక్తిగత విషయాల గురించి మనలో చాలామందికి తెలియదు.మొదట ఈటీవీ ఢీ ప్రోగ్రామ్ ద్వారా కంటెస్టెంట్ గా సాయిపల్లవి అభిమానులకు పరిచయం అయ్యారు.

ఆ తర్వాత మలయాళం ప్రేమమ్ సినిమాలో సాయిపల్లవి పాత్ర ఆమెకు మల్లూవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోను మంచి గుర్తింపు దక్కేలా చేసింది.నటనతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేయగల ప్రతిభ సాయిపల్లవికి సొంతం.

ప్రేమమ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా సాయిపల్లవికి వరుస ఆఫర్లు వచ్చాయి.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి టాలీవుడ్ కు పరిచయమైంది.

ఫిదా సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి ఒక రకంగా చెప్పాలంటే సాయి పల్లవే కారణం.ఇకపోతే సాయిపల్లవికి అందమైన చెల్లి ఉంది.

సాయిపల్లవి చెల్లెలి పేరు పూజా కన్నన్.వీరిద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు.సాయిపల్లవిలాగే పూజా కన్నన్ ఎంతో అందంగా ఉంది.సాయిపల్లవి చెల్లెలు కావడంతో ఈమెకు వివిధ ఇండస్ట్రీల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి.పూజా కన్నన్ ఏ రైడ్ ఫర్ ఎ లవ్ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.లుక్స్ లో సాయిపల్లవిని పోలి ఉన్న పూజా కన్నన్ అక్కలా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube