ఆ చాక్లెట్లలో రక్తాన్ని కలుపుతారా..?!

చిన్న పిల్లల నుండి పెద్దవారు దాకా చాక్లెట్లు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.దీంతో చాక్లెట్ లకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.

 Interesting Facts About Russia Blood Chocolate Details,  Blood Choclate, Viral N-TeluguStop.com

పుట్టినరోజు వేడుకల్లో గాని, ఎవరికైనా గిఫ్ట్ లు ఇవ్వాలన్నా గాని, పార్టీలలో గాని చాక్లెట్లు అంత్యంత ప్రాధాన్యత వహిస్తాయి.అలాంటి చాక్లెట్లు తయారు చేయడానికి చాక్లెట్ కంపెనీలు రకరకాల పదార్థాలు వేసి తయారు చేస్తారు.

అందులో రకరకాల బ్రాండ్లతో, రకరకాల ఫ్లేవర్లలో చాక్లెట్లు మనకు దొరుకుతాయి.

అయితే రష్యా దేశంలో చాక్లెట్లలో పశువుల రక్తాన్ని కలిపి తయారు ​చేస్తారట.

ఇది నిజమా అని ఆశ్చర్యపోతన్నారా.? ఇది నిజమేనండి.కానీ ఇలా చాక్లెట్ లలో రక్తాన్ని కలిపి తయారు చేయడం మన భారతదేశంలో లేదు.ఒక్క రష్యాలో తప్ప.

ఇదేదో రష్యా కొత్త రకం బ్రాండ్ అని మాత్రం అనుకోకండి.ఎందుకంటే రష్యా దేశంలో వారికి ఆహారంలో రక్తాన్ని కలుపుకుని తినే సాంప్రదాయం ఉందట.

ఇది వినడానికి కొత్తగా ఉన్నా.అక్కడ ఇలాంటి సాంప్రదాయాలు పాటించడం కొత్త కాదంట.

ఈ సాంప్రదాయం రష్యా ప్రాచీన కాలం నుండి పాటిస్తూ వస్తోంది.దీని వెనక ఏదో ఒక మంచి కారణం ఉందనేది వారి నమ్మకం.

Telugu Animals, Choclate, Hematozencandy, Latest-Latest News - Telugu

హేమటోజెన్ అనేది రష్యాలో మాత్రమే లభించే అరుదైన చాక్లెట్ లేదా క్యాండీ బార్.వాస్తవానికి ఇదొక మెడికల్ ప్రొడక్ట్ అంట.ఇందులో సుమారు 5 శాతం ఆవు రక్తాన్ని, చక్కెర, పాల మిశ్రమానికి వెనీలా రుచిని జోడించి చాక్లెట్ తయారు చేస్తారు.

ఇలా చాకలెట్లలో రక్తాన్ని కలపడం వల్ల పిల్లల్లో ఏర్పడే రక్త హీనత, పోషకార లోపం వంటి సమస్యలకు మందు గా పని చేస్తుంది.

రష్యాలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడి చిన్నారులు చలికి తట్టుకునే శక్తిని ఇస్తుంది.అలాగే గోళ్లు, జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా రాకుండా చూస్తుంది.

ఈ చాక్లెట్స్ రష్యా, పొరుగు దేశాలలో కూడా లభిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube