ఆ హాలీవుడ్ సినిమా స్పూర్తితో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోందా.. నిజమేంటంటే?

తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ అనే సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ సాధించడంతో డీవీవీ దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాకు ఖర్చు విషయంలో వెనుకాడటం లేదు.

 Interesting Facts About Rajamouli Rrr Movie Details, Hollywood Movies, Interesti-TeluguStop.com

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ హాలీవుడ్ సినిమా స్పూర్తితో తెరకెక్కిందని తెలుస్తోంది.సినిమాలోని అన్ని సన్నివేశాలు కాకపోయినా ఎన్టీఆర్, చరణ్ బైక్ పై కనిపించే సీన్స్ “ది మోటార్ సైకిల్ డైరీస్” అనే సినిమా నుంచి జక్కన్న స్పూర్తి పొందినట్లు తెలుస్తోంది.

ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆర్ఆర్ఆర్ రిలీజైతే మాత్రం జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.2004 సంవత్సరంలో విడుదలైన ది మోటార్ సైకిల్ డైరీస్ సినిమా నెటిజన్ల ప్రశంసలను అందుకుని అప్పట్లో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు క్లైమాక్స్, స్రీన్ ప్లే హైలెట్ గా నిలవగా ఈ సినిమా నుంచి రాజమౌళి స్పూర్తి పొందారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి రాజమౌళి క్లారిటీ ఇచ్చినా ప్రేక్షకులు మాత్రం ట్రైలర్ రిలీజయ్యే వరకు తాము నమ్మలేమని చెబుతున్నారు.

Telugu Hollywood, Rajamouli, Ram Charan, Rrr, Cycle, Tollywood-Movie

రాజమౌళి ప్రమోషన్స్ కు సంబంధించి వేగం పెంచకపోవడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రేక్షకుల్లో అనుమానాలు తొలగిపోలేదు.ఆర్ఆర్ఆర్ రాజమౌళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Hollywood, Rajamouli, Ram Charan, Rrr, Cycle, Tollywood-Movie

దాదాపుగా ఒకే సమయంలో పుట్టి కనిపించకుండా పోయి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్రం కోసం పోరాటం చేసే పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కనిపించనున్నారు.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకోగా ఆర్ఆర్ఆర్ మూవీతో ఆయా హీరోల ఆశలు నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube