ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆ 40 నిమిషాలే హైలెట్ కానుందా.. గూస్ బంప్స్ వచ్చేలా?

సాధారణంగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి.ఆసక్తికర ట్విస్టులతో, అదిరిపోయే డైలాగ్స్ తో, గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సన్నివేశాలతో తన సినిమాలు తెరకెక్కేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటారు.

 Interesting Facts About Rajamouli Rrr Movie Details Here , Interesting Facts, Rajamouli, Rrr Movie, Thearters, Ntr , Charan-TeluguStop.com

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరి 40 నిమిషాలు వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం.

సినిమాలో చివరి 40 నిమిషాలు యాక్షన్ సన్నివేశాలే ఉంటాయని యాక్షన్ సన్నివేశాలకు ఎమోషన్స్ ను మిక్స్ చేసి రాజమౌళి ఈ సీన్లను తెరకెక్కించారని తెలుస్తోంది.

 Interesting Facts About Rajamouli Rrr Movie Details Here , Interesting Facts, Rajamouli, Rrr Movie, Thearters, Ntr , Charan-ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆ 40 నిమిషాలే హైలెట్ కానుందా.. గూస్ బంప్స్ వచ్చేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చరణ్, ఎన్టీఆర్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించే ఈ యాక్షన్ సీన్స్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంటాయని బోగట్టా.ప్రేక్షకుల రోమాలు నిక్కబొడిచేలా ఈ సినిమా సెకండాఫ్ లోని చివరి 40 నిమిషాల సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు ఆర్ఆర్ఆర్ మూవీ విందుభోజనంలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మార్చి 18 లేదా ఏప్రిల్ 28వ తేదీన ఆర్ఆర్ఆర్ థియేటర్లలో సందడి చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ రెండు తేదీలలో ఏదో ఒక తేదీలో సినిమా విడుదల కాకపోతే మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్ పై విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

Telugu Charan, Rajamouli, Rrr-Movie

వేసవిలో విడుదల కాబోయే ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరో సంచలనానికి తెర తీశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.కరోనా కేసులు పెరగకపోతే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై సందడి చేసేది.

ఇంటెర్వల్ బ్యాంక్ కూడా ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా జక్కన్న తెరకెక్కించారని సమాచారం.తన సినిమాలకు సంబంధించిన విషయాలు లీక్ కాకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube