పవిత్ర లోకేష్ ఇప్పటికే ఇద్దరు భర్తలతో విడిపోయిందా.. ఏం జరిగిందంటే?

సినిమా నటిగా, టీవీ నటిగా పవిత్ర లోకేష్ కు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.కన్నడ, తెలుగు భాషల్లో సహాయ నటిగా పవిత్ర లోకేష్ కెరీర్ ను కొనసాగిస్తునన్నారు.16 సంవత్సరాల వయస్సులోనే పవిత్ర లోకేష్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టగా ఆమె సోదరుడు కూడా నటుడు కావడం గమనార్హం.పవిత్ర లోకేష్ 150కు పైగా కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Interesting Facts About Pavitra Lokesh Details, Pavitra Lokesh, Pavitra Lokesh H-TeluguStop.com

ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకున్న పవిత్ర లోకేష్ తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చారు.సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేయలేకపోవడంతో ఆమె సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు.

పలు యాడ్స్ లో కూడా నటించిన పవిత్ర లోకేష్ కన్నడలో ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.గత కొన్నిరోజులుగా నరేష్ తో వివాహం ద్వారా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలిచారు.

అయితే పవిత్ర లోకేష్ ఇప్పటికే ఇద్దరు భర్తలతో విడిపోయిందని సమాచారం.

Telugu Senior Naresh, Divorce, Pavitra Lokesh, Pavitralokesh-Movie

మొదట పవిత్ర లోకేష్ కు హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి జరిగిందని పెళ్లైన ఏడాదికే ఆమె భర్తతో విడిపోయారని సమాచారం.ఆ తర్వాత పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకున్నారు.ఈ వివాహం అటు పవిత్రకు ఇటు సుచేంద్రకు రెండో వివాహం కావడం గమనార్హం.

గుప్తగామిని అనే సీరియల్ ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది.

Telugu Senior Naresh, Divorce, Pavitra Lokesh, Pavitralokesh-Movie

ఒక ఇంటర్వ్యూలో తన రెండో భర్త గురించి గొప్పగా చెప్పిన పవిత్ర లోకేష్ విడిపోవటం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.పవిత్ర లోకేష్ నరేష్ తో పెళ్లికి సంబంధించిన వార్తల గురించి స్పందించడం లేదు.నరేష్ కూడా ఇప్పటికే ముగ్గురు భార్యలతో విడిపోయిన సంగతి తెలిసిందే.

మరి పవిత్ర లోకేష్ నరేష్ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube