పేపర్ వేస్తే తప్పేంటన్న బుడ్డోడు.. ఇతని మాటల వెనుక తల్లి ఆలోచన ఏంటంటే?

కొన్ని రోజుల క్రితం పేపర్ వేస్తే తప్పేంటంటూ బుడ్డోడు సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే.గవర్నమెంట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే శ్రీ ప్రకాష్ గౌడ్ చెప్పిన సమాధానం విని మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు.

 Interesting Facts About Paper Boy Sri Prakash Details, Paper Boy, Sainik School,-TeluguStop.com

ఈ తరానికి చెందిన ఎంతోమంది పిల్లలకు ఈ బుడ్డోడు ఆదర్శం అని నెటిజన్లు కామెంట్లు చేశారు.వయస్సు తక్కువే అయినా ఈ బుడ్డోడు కష్టపడితే తప్పేంటని చెబుతూ కష్టం యొక్క విలువ గురించి చెప్పుకొచ్చారు.

అయితే శ్రీప్రకాష్ డబ్బుల కోసమే పేపర్ బాయ్ గా మారాడని చాలామంది అనుకున్నారు.అయితే శ్రీప్రకాష్ పేపర్ బాయ్ గా మారడం వెనుక అతని తల్లి ఆలోచన ఉంది.

ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్న కుటుంబం అయినప్పటికీ చిన్నప్పటి నుంచే కష్టపడి పని చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం వస్తుందని తల్లి ఆలోచించి చిన్న కొడుకును పేపర్ బాయ్ గా చేశారు.కొడుకు పేపర్ బాయ్ కావడం వల్ల ఉదయాన్నే లేచి సమాజాన్ని గమనిస్తాడని ఈ బుడ్డోడి తల్లి చెప్పుకొచ్చారు.

చదువు చదువే పని పనే అని శ్రీప్రకాష్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Telugu Fourth Class, Ktr, Paper Boy, Paperboy, Sainik School, Sreeprakash, Sri P

ఇప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా ఉండవచ్చని శ్రీప్రకాష్ వెల్లడించారు.పేపర్ వేయడాన్ని నామోషీగా ఫీల్ కాలేదని పేపర్ వేయడం వల్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని శ్రీప్రకాష్ అన్నారు.ఉదయం 4.30 గంటలకు తాను నిద్ర లేస్తానని అమ్మకు చిన్నచిన్న పనుల విషయంలో సాయం చేస్తానని శ్రీప్రకాష్ తెలిపారు.

Telugu Fourth Class, Ktr, Paper Boy, Paperboy, Sainik School, Sreeprakash, Sri P

సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కు ప్రస్తుతం ప్రిపేత్ అవుతున్నానని శ్రీ ప్రకాష్ వెల్లడించారు.శ్రీప్రకాష్ అన్న కూడ ఒకప్పుడు పేపర్ బాయ్ అని సమాచారం.కొడుకు ఇమ్యూనిటీ పవర్, మేధాశక్తిని పెంచడానికి తాము చిన్ని ప్రయత్నం చేస్తున్నామని బుడ్డోడి తల్లి చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube