పానసోనిక్ కంపెనీ ఎలా పుట్టింది.. పేదరికం నుంచి ఎలా ఎదిగింది?

ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి.కొన్ని చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటుంటే.మరికొన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ హవా కొనసాగిస్తున్నాయి.కంపెనీలన్నీ ఒకప్పుడు చిన్న చిన్నగా ప్రారంభమైనవే.తర్వాత తమ వ్యాపార కార్యకాలాపాలను విస్తరించుకుంటూ పెట్టబడులను ఆకర్షిస్తూ లాభాలను గడిస్తున్నాయి.పెట్టుబడలు పెరగడంతో కంపెనీలు ఒక్కసారిగా సక్సెస్ అవుతున్నాయి.

 Interesting Facts About Panasonic Company Details, Panasonic, Company, How It Be-TeluguStop.com

ఇప్పుడు మనందరికీ తెలిసిన పానసోనిక్ కంపెనీ వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది.పేదరికం నుంచి పుట్టిన ఆ కంపెనీ ఇప్పుడు అన్ని దేశాల్లో తన వ్యాపారాలను చేస్తోంది.

కొనోసుకె ముత్సహిత అనే వ్యక్తి ఈ కంపెనీని స్థాపించాడు.మొదట ఎలక్ట్రిక్ పగ్ లు, హోల్డర్లతో ప్రారంభమైన అతని వ్యాపారం… ప్రస్తుతం ఇంట్లో ఉపయోగించే అన్ని ఎలాక్ట్రానిక్ వస్తువులను తయారుచేసే స్థాయికి ఎదిగింది.

ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫ్రీజ్ లు ఇలా ఇంట్లోకి వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు తయారు చేస్తోంది.జపాన్ లోని వసముర అనే విలేజ్ లో కొనెసుకె మత్సుహిత జన్మించాడు.

తన తల్లిదండ్రులకు తొమ్మది మంది పిల్లులుండగా.అందరి కంటే ఇతను చిన్నవాడు.

తండ్రి జూదం ఆడి డబ్బులు పొగోట్టడంతో కుటుంబ బజారున పడింది.తొమ్మిదేండ్లకే మత్సుహిత బండి మానేసి ఓ షాపులో పనికి చేరాడు.

కొద్దిరోజులకే అక్కడ మానేసి ఓసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరాడు.అదే టైంలో ముమొనోతో పెళ్లి అయింది.ఆ కంపెనీలో విద్యుత్ బల్బులు, సాకెట్స్, విద్యుత్ ల్యాంప్ లు తయారుచేయడం నేర్చుకున్నాడు.అలా నేర్చుకున్నదానితో ఎలక్ట్రిక్ సాకెట్, ప్లగ్ లు తయారు చేయడం నేర్చుకున్నాడు.

ఆ తర్వాత ఉద్యోగంలో వచ్చిన డబ్బును ఆదా చేసుకుని మత్సుహిత ఎలక్ట్రిక్ వేర్ హోస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు.

Telugu Company, Japan, Panasonic, Ups, Latest-General-Telugu

కంపెనీకి కోసం భార్య నగలు, ఇంట్లోనే విలువైన వస్తువులు అన్నీ అమ్మేశాడు.కంపెనీకి నష్టాలు రావడంతో బ్యాంకు లోన్ తీసుకున్నాడు.అవి కట్టకకపకోవడంతో ఇంటిని బ్యాంకు సిబ్బంది వేలం వేశారు.

అయితే అనుకోని విధంగా అతని కంపెనీకి వెయ్యి హోల్డర్ లు, ప్లగ్ లకు ఆర్డర్ వచ్చింది.అక్కడి నుంచి అతని దశ తిరిగింది.

ఆ తర్వాత టీవీలు, ప్రిజ్ లు , ఏసీలు.ఇలా ఇంట్లో ఉపయోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు తయారుచేసే స్థితికి పానసోనిక్ కంపెనీని తీసుకెళ్లాడు.

ప్రపంచమంతా తన బ్యాంచ్ లు విస్తరించాడు.అయితే 94 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో మత్సుహిత చనిపోయాడు.

పానసోనిక్ పేరుకు అర్థం ఏంటంటే.పాన్ అంటే ప్రపంచం, సోనిక్ అంటే సౌండ్ అని అర్థం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు కంపెనీ గురించి తెలిసేలా సౌండ్ చేయడం అని అర్థం.2008లో మత్సుహిత ఎలక్ట్రిక్ వేర్ మౌస్ కంపెనీకి బదులు పానసోనిక్ అనే పేరు పెట్టారు.కంపెనీ పెట్టి వందేళ్ల కూడా పూర్తి అయింది.ఇలా పేదరికంతో స్టార్ అయితే పానసోనిక్ కంపెనీ ఇప్పుడు ప్రముఖ కంపెనీకి ఎదిగింది.ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రగామి సంస్ధగా పేరు తెచ్చుకుంది.ఇలా ఏదైనా ఒక కంపెనీ ఎదగడానికి వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube