బర్త్ డే స్పెషల్!!! 'నివేధా థామస్' గురించి 7 ఆసక్తికర విషయాలు.! మీరు చూడని 25 రేర్ ఫొటోస్.!

జెంటిల్మెన్ సినిమాలో నాని సరసన నటించిన మళయాలి ముద్దుగుమ్మ నివేధా థామస్.నిన్ను కోరి ,జై లవకుశ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందింది.

 Interesting Facts About Niveda Thomas-TeluguStop.com

తన అందం ,అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది.నిన్ను కోరి తో ఆడియన్స్ ప్రశంసలు అందుకుంది.

స్కిన్ షో కి దూరంగా కేవలం తన నటనతోనే అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.నివేధా థామస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

1.చిన్నప్పుడు ఆటలు,ఇటు చదువులో ఎప్పుడూ ముందుండేది నివేధా.అదేవిధంగా సీరియల్స్ లో కూడా నటించేది.ఆమె నటించిన సీరియల్స్ లో కొన్ని మై డియర్ భూతం.,రాజేశ్వరి,శివమయం.

2.ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది.నివేధా నటించిన మొదటి సినిమా ఉత్తర.

3.పదమూడేళ్ల వయసులో కేరళ రాష్ట్రం అందించే ఉత్తమనటి పురస్కారం అందుకుంది.వెరితె ఒరు భార్య అనే చిత్రంలో తన నటనకు గానూ కేరళ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది.

4.తన అభిమాన నటుడు కమల్ హాసన్ తో నటించే అవకాశాన్ని ఎలా వదులుకుంటుంది.అందుకే పాపనాశంలో కమల్ కి పెద్దకూతురుగా నటించింది.

తెలుగులో వచ్చిన దృశ్యం సినిమాకు రీమేకే ఈ పాపనాశం.

5.సినిమా హీరోయిన్ అంటే నోరు కట్టేసుకుని కూర్చోవాలి.ఇష్టమైనవి తినడానికి ఉండదు.

ఎక్కడ బరువెక్కిపోతామో అనే కారణం.కానీ నివేధా తను ఏం తినాలనుకుంటే అది నిర్బయంగా తినేస్తుంది.

మంచి భోజనప్రియురాలు.

6.డీ గ్లామర్ రోల్స్ చేయడానికి నివేధ ఎక్కువ ఇష్టపడుతుంది.ఉదాహరణకు బిచ్చగత్తె,సైకో లాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని చేయడానికి ఇష్టపడుతుంది.

7.ఒకవేళ హీరోయిన్ కాకపోయుంటే టీచర్ అయ్యేదంట నివేధా థామస్.












.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube