నేను లోకల్ సినిమాను మిస్సైన మెగా హీరో ఎవరో మీకు తెలుసా?

నాని హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ నిర్మాతలుగా తెరకెక్కిన నేను లోకల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలు దిల్ రాజుకు, బెల్లెం వేణుగోపాల్ మంచి లాభాలను అందించింది.నాని కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Nani Nenu Local Movie Details Here ,producer Bekkam Venu Gopal, Nani, Nenu Local Movie, Cinema Chupista Maava, Sai Dharam Tej,-TeluguStop.com

కామెడీతో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండటంతో ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.

ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది డబ్బు ఉంటే చాలని భావించి సినిమా రంగంలోకి వస్తున్నారని నిర్మాతకు కథను ఎంపిక చేసుకునే జ్ఞానం ఉండాలని ఆయన అన్నారు.

 Interesting Facts About Nani Nenu Local Movie Details Here ,producer Bekkam Venu Gopal, Nani, Nenu Local Movie, Cinema Chupista Maava, Sai Dharam Tej, -నేను లోకల్ సినిమాను మిస్సైన మెగా హీరో ఎవరో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాను ప్రమోషన్ చేసే సత్తా, బిజినెస్ చేసే సామర్థ్యం ఉండాలని బెక్కెం వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.డబ్బు ఒకటి ఉంటే సినిమా రంగంలో సక్సెస్ కావచ్చని భావించడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.

ఎవరు ఆ పాత్రకు సూట్ అవుతారో వాళ్లను మాత్రమే ఆ పాత్రకు ఎంపిక చేస్తానని బెక్కెం వేణుగోపాల్ అన్నారు.కథను నమ్మే తాను ముందుకు వెళతానని ఆయన చెప్పుకొచ్చారు.నేను లోకల్ మొదట సాయిధరమ్ తేజ్ తో అనుకున్నామని కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదని ఆ తర్వాత నానికి చెప్పి ఒప్పించడం ఆ సినిమా పట్టాలెక్కడం జరిగిందని బెక్కెం వేణుగోపాల్ కామెంట్లు చేశారు.

సినిమా చూపిస్తా మావ సినిమాకు మొదట రాజ్ తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లు కాదని సినిమా ఓపెనింగ్ తర్వాత వీళ్లిద్దరి ఎంపిక జరిగిందని బెక్కెం వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.ఎన్నో చిన్న సినిమాలకు సలహాలు ఇచ్చి తన వంతు సహాయం చేశానని బెక్కెం వేణుగోపాల్ వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube