ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నాగార్జున సినిమా ఇదే!

నాగార్జున సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.నాగ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

 Interesting Facts About Nagarjuna Geetanjali Details, Nagarjuna, Geetanjali, Nag-TeluguStop.com

నాగ్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానుండగా వచ్చే నెలలో నాగ్ నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదల కానుంది.ఈ రెండు సినిమాలు నాగార్జున కెరీర్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాగ్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో గీతాంజలి సినిమా కూడా ఒకటి.అయితే ఈ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్ వచ్చింది.డైరెక్టర్ మణిరత్నం తెలుగులో డైరెక్షన్ చేసిన ఏకైక సినిమా గీతాంజలి కావడం గమనార్హం.లవ్ స్టోరీస్ లో క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమా ఈతరం ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చింది.

ఎంతోమంది పేర్లను పరిశీలించి మణిరత్నం ఈ సినిమాలో నాగార్జునను ఫైనల్ చేశారు.

ఆ తర్వాత కొత్త నటి గిరిజ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.

ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించగా ఊటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Actress Girija, Brahmastra, Geetanjali, Ilayaraja, Nagarjuna, Ghost-Movie

హీరో, హీరోయిన్ కు క్యాన్సర్ కావడంతో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఆసక్తి చూపించలేదు.ఆ తర్వాత ప్రొడ్యూసర్ నరసారెడ్డి ఈ సినిమాను ముఖ్యమైన కేంద్రాలలో విడుదల చేశారు.

మొదటి మూడు వారాలు ప్రేక్షకుల నుంచి స్పందన పెద్దగా లేకపోవడంతో బాక్సులు వెనక్కు వచ్చాయి.

అయితే నరసారెడ్డి మాత్రం మిగిలిన కేంద్రాల్లో నాలుగో వారం కూడా ఈ సినిమాను కొనసాగించాలని చెప్పారు.ఆ తర్వాత క్రమంగా కలెక్షన్లు పెరిగి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

నాగార్జునకు ఈ సినిమాతో క్లాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube