ఒక వీడియో తో వరల్డ్ ఫేమస్ ఐనా తెలంగాణ పల్లెటూరి కుర్రోళ్లు ..ఎంతోమందికి ఆదర్శము ఈ మై విల్లజ్ షో టీము ...ఎలానో చూడండి ...షేర్ చేయండి...  

కికీ చాలెంజ్.. రన్నింగ్ కారులో నుంచి రోడ్డు మీదికి దూకి ఇట్స్ మై ఫీలింగ్ పాటకు డాన్స్‌చేసి, తిరిగి అదే కారులోకి ఎక్కడం. దీనిని సోషల్ మీడియాలో పెట్టి మరికొందరికి చాలెంజ్ విసరడం. సోషల్ మీడియాలో ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న హాట్ అండ్ డేంజరస్ చాలెంజ్ ఇది. దీనికి సెలబ్రిటీ టచ్ ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే . ఈ కికీ చాలెంజ్‌కు ఇద్దరు తెలంగాణ యువకులు దేశీ టచ్.. అగ్రికల్చర్ లుక్ ఇచ్చారు. ఈ యువరైతులు చేసిన వీడియో తెలంగాణ నుంచి బాలీవుడ్‌కు అక్కడి నుంచి అంతర్జాతీయస్థాయికి చేరింది.

అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ కమెడియన్, అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోహ్ వీరిని ఈ చాలెంజ్ విజేతలుగా ప్రకటించారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళు డాన్స్ చేసిన వీడియో ని అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసారు. ఆ ఛానల్ వెనక ఉన్న స్ఫూర్తిదాయక ప్రయాణం ఇదే.! ఆ యువకుల గురించి ఆసక్తికర విషయాలు మీరే చూడండి!

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

Interesting Facts About My Village Show KikiChallenge Guys

1. రెండు, మూడు సంవత్సరాల నుండి యూ ట్యూబ్ వీడియోల హవా పెరిగిపోయింది, జియో ఎఫెక్ట్ తో డేటా రేట్లు బాగా పడిపోవటం, స్మార్ట్ ఫోన్లు చిన్న చిన్న గ్రామాలలోకి ప్రవేశించడం వల్ల యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళతో పాటు, తీసేవాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు, షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ వీడియోలు, సినిమా వీడియోలు అంటూ రకరకాల వీడియోలు వస్తున్నాయి. అలాగే ఆ ఇద్దరు యువకులు కూడా My Village Show యూట్యూబ్ ఛానల్ తో ముందుకొచ్చారు. కొద్ది కాలంలోనే లక్ష సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకున్నారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

2. తెలంగాణ గ్రామీణ జీవితాలని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, ఊరిలో ఉండే మనుషుల మధ్య జరిగే విషయాలనే కాన్సెప్ట్ గా తీసుకోని ఆ యువకువులు వీడియోలు చేస్తూ ఉంటారు. .చాలా తక్కువ సమయం లో మంచి ఆదరణ పొందిన షో ఇది.ఫుల్ గా నవ్వుకునేలా మంచి కామెడీ ఉండేలా తీస్తున్నారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

3. ఈ వీడియోలలో చూపించే ఊరు లంబాడిపల్లి, ఇది జగిత్యాల జిల్లా కొండగట్టుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అతి తక్కువ ఖర్చుతో ఊర్లో ఉండే మిత్రుల సహకారంతో స్క్రిప్ట్, ఎడిటింగ్, మిక్సింగ్ పనులు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఊర్లోనే ఉంటూ నలుగురికి పని కల్పిస్తూ ఊరి అభివృద్ధికి కూడా సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఛానెల్ బృందం.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

4. ‘ లంబాడిపల్లి’ గ్రామంలోని శ్రీకాంత్‌, రాజు, అనిల్‌, శివ అనే యంగ్‌స్టర్స్‌ లక్ష్యం మాత్రం సొసైటీ కోసమే. పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని, సమాజానికి ఏదో చేయాలనే ప్రయత్నం సక్సెస్‌ అవుతోంది. పల్లెలో జరిగే ఘటనలకు కాస్త క్రియేటివిటీ జోడించి సందేశాత్మక వీడియోలతో పల్లె భాషను ప్రపంచానికి తెలియజేస్తూ పుట్టి పెరిగిన గ్రామానికి కీర్తి తెస్తున్నారు. ఎంత క్రేజ్‌ సంపాదించినా ఇదంతా సమాజం కోసమే అంటున్నారు. 8లక్షలతో హెచ్‌ఆర్‌డీసీ బిల్డింగ్‌ నిర్మిస్తూ గ్రామానికి అంకితం చేశారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

5. శ్రీకాంత్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్స్ తీసుకుని ఐపాడ్‌తో వీడియో తీసేవాడు. ఇప్పుడు డిజిటల్ కెమెరా కొన్నాడు. తీసిన వీడియో ఐపాడ్‌లోనే ఎడిటింగ్ చేస్తాడు. ఇంటిచుట్టూ ఉండే పిల్లలు, ఫ్రెండ్స్, మేనమామ అంజయ్యలే శ్రీకాంత్ వీడియోల్లో తారలు. పెద్దగా స్క్రిప్ట్ కూడా ప్లాన్ చేసుకోరు. ఒక టాపిక్ అనుకుని దాని మీద వీడియో చేసుకుంటూ డైలాగులు అల్లుకుంటూ పోతారు.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘యూట్యూబ్‌ ఫ్యాన్‌ ఫెస్ట్‌’లో కూడా పాల్గొని పల్లెటూరి కామెడీతో, మన యాసతో పర్ఫామెన్స్‌ ఇచ్చి వావ్‌.. అనిపించుకున్నారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

6. బోనాలు, బతుకమ్మ, క్రికెట్, సినిమా, టెక్నాలజీ ఇలా పల్లె నుంచి పట్నం దాకా, ఇంటి నుంచి ఇంటర్నేషనల్ టాపిక్స్ దాకా అన్నీ కవర్ చేస్తున్నాడు. అందుకోసం.. నేషనల్, ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాడు. కేవలం వినోదం పండించేట్టు మాత్రమే కాదు సమాజానికి కాస్త సందేశాన్నిచ్చే లాగ వీడియో తీస్తారు వారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

7. ఉదాహరణకు…”ఎప్పుడూ హోటళ్లో జంక్‌ ఫుడ్‌ తినే రాజుగానికి ఓ రోజు కడుపు నొప్పి మొదలవుద్ది. డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన రాజు చుట్టు పక్కల వాళ్ల మాటలు విని మంత్రంగాని దగ్గరకు వెళ్తాడు. అమ్మ గంగవ్వకు అందరూ రాజుగాని అవస్థజూసి సలహాలివ్వడంతో ఈ పని చేస్తది. నెల రోజులైనా కడుపునొప్పి తగ్గది. ఏమాయిందో అర్థం కాదు. గంగవ్వ గడబిడ అయితది. తాయితులు కట్టిపిస్తది అయినా ఫాయిదా ఉండదు. ఇదంతా జూసిన రాజు అన్న డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లి సరైన మందులు ఇప్పిస్తాడు”. అదంతా గ్రామాల్లో జరిగే నిరంతర ఘటన. దీన్నే ‘రాజుగానికి దెయ్యం పట్టింది’ టైటిల్‌తో యూట్యూబ్‌లో వదిలారు. కడుపునొస్తే మందులు వాడాలే గానీ మంత్రాలు ఉండవని దాని సారంశం.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

8. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆక్టింగ్‌, ఎడిటింగ్‌ అన్నీ వాళ్లే చేసుకుంటారు. శ్రీకాంత్‌ ఒక్కనితో మొదలైన ఈ జర్నీ రాజు, శ్రీకాంత్‌, అనిల్‌, గంగవ్వ, శివ తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. స్క్రిప్ట్‌కు తగ్గ క్యారెక్టర్లే చేసే యాక్టర్లుంటే వీళ్లు మాత్రం వీళ్లకు తగ్గ స్క్రిప్ట్‌ను రాసుకుని ఆక్టింగ్‌తో కేకపుట్టిస్తారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

9. సందేశాత్మక చిత్రాలు తీయాలన్న తపన, ప్రజలకు అవగాహన కల్పించాలన ఆలోచన శ్రీకాంత్‌ను డైరెక్టర్‌ను, కెమెరామెన్‌ను చేసింది. రాజును ఆక్టర్‌ చేసింది. గంగవ్వను సెలబ్రెటీ చేసింది. లంబాడిపల్లిని పేరును, పల్లె పరిసరాలను ప్రపంచానికి తెలియజేసేలా చేసింది. వచ్చిన ఆదాయాన్ని సొసైటీకి కేటాయించి అందరి మన్ననలు పొందున్న మై విలేజ్‌ షో ఇంకా హిట్టవ్వాలని మనమూ కోరుకుందాం..

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

10. లంబడిపల్లి గ్రామానికి చెందిన గీలా అనిల్‌కుమార్ (24), పిల్లి తిరుపతి (28) కికీ చాలెంజ్‌ను సరదాగా.. డిఫరెంట్‌గా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. వరినాట్లు వేస్తున్న సందర్భంలో ఎద్దులతో పొలాన్ని గుంటుక కొడుతూ ఇట్స్ మై ఫీలింగ్స్ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను మై విలేజ్ షో ఫేమ్ శ్రీరామ్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానల్‌లో ఈ నెల 1న పోస్ట్‌చేశారు. అప్పటినుంచి వీడి యో వైరల్ అయింది. ఇప్పటివరకు 1.6 కోట్ల మంది ఈ వీడియోను చూశారు.

Interesting Facts About My Village Show KikiChallenge Guys-

Watch video here:Kiki challenge village farmers style India | my village show