మొబైల్ ఫోన్ల గురించి మీకు తెలియని ఇంటరెస్టింగ్ విషయాలు

మొబైల్ ఫోన్ కూడా మన జీవితంలో ఒక నిత్యవసర వస్తువు అయిపోయిందని చెప్పడం అతిశయోక్తి ఏం కాదు.ఎందుకంటే మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించేసింది.

 Interesting Facts About Mobile Phones-TeluguStop.com

స్మార్ట్ ఫోన్ యుగం మొదలయ్యాక మన జీవితంపై మొబైల్ ఫోన్ ప్రభావం ఏపాటిదో, ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.అలాంటి మొబైల్ ఫోన్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు మీకోసం.

* 1983 లో అమెరికాలో తొలిసారిగా అమ్మబడిన మొబైల్ ఫోన్ ధర అక్షరాల 4 వేల డాలర్లు.

* నోకియా 1100 మనందరికి తెలిసు కదా.మనలో చాలామంది వాడిన తొలి మొబైల్ అదే.ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే.దాదాపు 25 కోట్ల మంది ఈ మోడల్ ని కొనుగోలు చేశారు.

* ప్రపంచమంతటా వాడుతన్న మొబైల్ ఫోన్లలో 70% చైనాలో ఉత్పత్తి చేయబడతాయి.

* జపాన్ లో 90% ఫోన్లు వాటర్ ఫ్రూఫ్ సెక్యూరిటీని కలిగి ఉంటాయి.

* ప్రపంచంలోని మొదటి మొబైల్ కాల్ మార్టిన్ కూపర్‌ 1973లో చేశాడు.

* ప్రపంచానికి స్మార్ట్ ఫోన్ 1993లో పరిచయమైంది.ఐబిఎమ్ రూపొందించిన ఈ ఫోన్ పేరు సైమన్‌.

దీని ధర అప్పట్లోనే 899 డాలర్లు.

* ప్రస్తుతం, కంప్యూటర్ల కన్నా మొబైల్ ఫోన్ వాడే జనాభే ఎక్కువ అంట.

* సోనిమ్ XP3300 అనే మొబైల్ ప్రపంచంలో అత్యంత టఫ్ మొబైల్ గా చెబుతారు.దీన్ని 84 ఫీట్ల ఎత్తు నుంచి కింద పడేసిన ఎలాంటి డ్యామేజ్ జరగదట.

* ఐఫోన్ బ్లాక్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్.దీని ధర అక్షరాల 15 మిలియన్ డాలర్లు.

* 2012 సంవత్సరంలో ఆపిల్ సంస్థ రోజుకి 3 లక్షల 40 వేల ఫోన్లు అమ్మిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube