ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ టి.కృష్ణ కుమారుడు, ప్రముఖ నటుడు గోపీచంద్ 2001 సంవత్సరంలో తొలివలపు సినిమాలోని ప్రేమ్ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
తొలి సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత గోపీచంద్ విలన్ పాత్రలకు ఓకే చెప్పారు.జయం, నిజం, వర్షం సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో గోపీచంద్ విజయాలను సొంతం చేసుకున్నారు.
అయితే హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలని భావించి రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో యజ్ఞం సినిమాలో నటించి గోపీచంద్ నటుడిగా విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.యజ్ఞం మూవీ గోపీచంద్ సినీ కెరీర్ లో హీరోగా తొలి బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు యజ్ఞం సినిమాలో నటించే అవకాశం రాగా ఆయన రిజెక్ట్ చేయడంతో గోపీచంద్ ఈ సినిమాలో నటించారని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు ప్రభాస్ తండ్రిని కలిసి ప్రభాస్ ను యజ్ఞం సినిమాలో నటింపజేయాలని కోరగా ఆయన ఓకే చెప్పడంతో పాటు బి.గోపాల్ డైరెక్షన్ లో ఆ సినిమాను తెరకెక్కిద్దామని సూచించారు.అయితే పోకూరి బాబూరావు మాత్రం రవికుమార్ ను నమ్మి ఆయన డైరెక్షన్ లోనే గోపీచంద్ హీరోగా మూవీ తీయాలని అనుకున్నారు.
ఆ విధంగా ప్రభాస్ కు యజ్ఞం సినిమాలో నటించే ఛాన్స్ మిస్సైంది.
ప్రభాస్ అభిమానులు మాత్రం యజ్ఞం సినిమాలో ప్రభాస్ నటించి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు.యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి తెరకెక్కించిన యజ్ఞం సినిమా గోపీచంద్ కెరీర్ కు హెల్ప్ అయింది.ఆ మూవీ తర్వాత గోపీచంద్ నటించిన ఆంధ్రుడు, రణం సినిమాలు సక్సెస్ సాధించడంతో హీరోగా గోపీచంద్ కు వరుస ఆఫర్లు వచ్చాయి.