ఎన్టీఆర్ పాట వల్ల ఈ డైరెక్టర్ పేరు మార్చుకున్నారట.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Interesting Facts About Mental Madilo Movie Director Vivek Athreya-TeluguStop.com

పేరు మార్చుకోవడానికి గల కారణం గురించి చెబుతూ అక్క ఇంజనీరింగ్ చదివే సమయంలో పేరు చివరన ఆత్రేయ అని పెట్టుకోగా తాను కూడా పెట్టుకున్నానని వివేక్ ఆత్రేయ అన్నారు.

తాను పేరు మార్చుకోవడానికి ఊసరవెల్లి సినిమాలోని పాట కూడా ఒక కారణం అవ్వొచ్చని వివేక్ ఆత్రేయ అన్నారు.

 Interesting Facts About Mental Madilo Movie Director Vivek Athreya-ఎన్టీఆర్ పాట వల్ల ఈ డైరెక్టర్ పేరు మార్చుకున్నారట.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను సెట్స్ చూడకుండానే దర్శకునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని సినిమాలకు సంబంధించిన ప్రోటోకాల్స్ తెలియకపోవడంతో స్టార్టింగ్ రోజుల్లో తాను మేనేజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయని వివేక్ ఆత్రేయ అన్నారు.మెంటల్ మదిలో కథ మొదట విజయ్ దేవరకొండకు చెప్పానని కథ నచ్చినా పెళ్లిచూపులు జోనర్ కథ కావడంతో విజయ్ ఆ సినిమాకు నో చెప్పారని వివేక్ ఆత్రేయ అన్నారు.

శ్రీవిష్ణు తనకు అన్నయ్యాలంటివాడని శ్రీవిష్ణు ఎనర్జీ లెవెల్స్ ను తాను ఇష్టపడతానని వివేక్ ఆత్రేయ పేర్కొన్నారు.మెంటల్ మదిలో స్క్రిప్ట్ తో ఒక నిర్మాత దగ్గరకు వెళ్లగా ఆ కథ అప్పటికే వచ్చేసిందని చెప్పారని నిద్రమత్తులో అలా చెప్పారని వివేక్ ఆత్రేయ అన్నారు.బ్రోచేవారెవరురా కథను మరో నిర్మాతకు చెప్పడానికి వెళితే ఆయన అమ్మాయిలను చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తుండటంతో తాను ఆయనపై గట్టిగా అరిచేశానని వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చారు.

నాన్నకు తాను రచయితనని తెలుసని అయితే తాను డైరెక్టర్ అవుతానని నాన్న ఊహించలేదని వివేక్ ఆత్రేయ వెల్లడించారు.నాన్నకు కోపం వస్తే దర్శకుడివి కదా ఈ మాత్రం కూడా తెలీదా అని అంటారని వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చారు.

#Jr NTR #Sri Vishnu #Viveka Threya #Mental Madilo #Oosaravelli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు