మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఇదే.. 5 బ్లాక్ టికెట్లు 10 వేల రూపాయలట!

టాలీవుడ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాల క్రితం వరకు చిరంజీవి నంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగించి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారనే సంగతి తెలిసిందే.చిరంజీవి సినిమా విడుదలైతే కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి.

 Interesting Facts About Megastar Chiranjeevi Range Details Here , 10000rupees ,-TeluguStop.com

చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఇంద్ర సినిమా కూడా ఒకటి.

2002 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే ఏకంగా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఇంద్ర కావడం గమనార్హం.ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో చిరంజీవి చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఈ సినిమాలో చిరంజీవి నటించారు.

సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం.

ఈ సినిమా గురించి బి.గోపాల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మదనపల్లిలో తనకు తెలిసిన ఒక వ్యక్తి బ్లాక్ లో 10,000 రూపాయలు ఇచ్చి ఇంద్ర సినిమా 5 టికెట్లను తీసుకున్నాడని చెప్పుకొచ్చారు.ఇంద్ర సినిమాకు జనాలను కంట్రోల్ చేయడానికి ఎస్పీ స్థాయి అధికారి వెళ్లాల్సి వచ్చిందని ఒక ఎస్పీ తనకు చెప్పిన విషయాన్ని బి.గోపాల్ వెల్లడించారు.

Telugu Rupees, Chiranjeevi, Indra-Movie

ఇంద్ర మూవీ కాశీ షెడ్యూల్ గొప్పగా జరిగిందని బి.గోపాల్ కామెంట్లు చేశారు.సినిమాలోని డైలాగ్స్ ను మెగాస్టార్ అద్భుతంగా చెప్పారని బి.గోపాల్ అన్నారు.ఆ సినిమాలో చిరంజీవి వేసిన స్టెప్పులు సంచలనం సృష్టించాయని బి.గోపాల్ వెల్లడించారు.చిరంజీవి కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాల్లో ఇంద్ర ఒకటి.ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube