చిరంజీవిని సురేఖ తొలిసారి ఎక్కడ చూశారో మీకు తెలుసా..?

ప్రతిభ, స్వయంకృషితో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుని చిరంజీవి మంచి పేరును సంపాదించుకున్నారు.తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో సైతం చిరంజీవి నటించడం గమనార్హం.

 Interesting Facts About Tollywood Megastar Chiranjeevi And His Wife Surekha, Chi-TeluguStop.com

టాలీవుడ్ మెగాస్టార్ గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి తన నట జీవితాన్ని పునాది రాళ్లు సినిమాతో ప్రారంభించగా ప్రాణం ఖరీదు సినిమా మొదట రిలీజైంది.చిరంజీవి తన సినీ కెరీర్ లో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు నంది పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.

తెలుగులో 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన తొలి సినిమా చిరంజీవి నటించిన ఘరానా మొగుడు కావడం గమనార్హం.1992 సంవత్సరంలోనే కోటీ 25 లక్షల రూపాయల పారితోషికం తీసుకుని అప్పటికి భారత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా చిరంజీవి రికార్డులకెక్కారు.ఎన్నో సర్వేలలో తెలుగులో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడిగా చిరంజీవి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

చిరంజీవి 1980 సంవత్సరంలో అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు.

Telugu Days, Allu Aravind, Chiranjeevi, Kanakaratnam, Ramcharan, Surekha-Movie

చిరంజీవి సురేఖ దంపతులకు సుస్మిత, శ్రీజ కూతుళ్లు కాగా రామ్ చరణ్ అనే కొడుకు ఉన్నారు.చిరంజీవి ఒకసారి సత్యనారాయణ అనే వ్యక్తితో కలిసి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్లగా అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం చిరంజీవి సాంప్రదాయాలు, కులగోత్రాలు, ఇతర విషయాల గురించి తెలుసుకున్నారు.

ఆ తర్వాత కనకరత్నం కొడుకు అరవింద్ కు ఆ విషయం చెప్పారు.అయితే చిరంజీవికి అప్పటికే సురేఖ ఫ్యాన్ కావడంతో పెళ్లికి వెంటనే ఒప్పుకున్నారు.

Telugu Days, Allu Aravind, Chiranjeevi, Kanakaratnam, Ramcharan, Surekha-Movie

సురేఖ చిరంజీవిని తొలిసారి తాయారమ్మ బంగారయ్య 100 డేస్ ఫంక్షన్ లో చూశారు.ఒక సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీలో నటిస్తుండగా కొన్ని రీమేక్ సినిమాలకు కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.చిరంజీవి నటించబోతున్న లూసిఫర్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube