చిరంజీవి తల్లి ఆచార్య టైటిల్ గురించి అలా అన్నారా?

సాధారణంగా సినిమా కథను బట్టి టైటిల్ ను ఫిక్స్ చేయడం జరుగుతుంది.కొన్నిసార్లు నెగిటివ్ టైటిల్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి.

 Interesting Facts About Megastar Chiranjeevi Acharya Movie Title, Interesting Fa-TeluguStop.com

కొరటాల శివ డైరెక్టర్ గా చిరు, చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమాకు ఆచార్య అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నక్సలైట్లుగా కనిపించబోతున్నారు.చిరంజీవి కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఆచార్య ఒకటి కాగా ఈ టైటిల్ గురించి చిరంజీవి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడగగా అందరూ బాగుందని చెప్పారట.

మెగాస్టార్ తల్లికి ఈ టైటిల్ ఎంతగానో నచ్చిందని సమాచారం.చిరంజీవి తల్లికి గతంలో కొన్ని సినిమాల టైటిల్స్ అస్సలు నచ్చలేదని తెలుస్తోంది.

Telugu Acharya, Anjana Devi, Kajal Agrawal, Koratala Shiva, Rakshashudu, Ramchar

రాక్షసుడు, కిరాతకుడు టైటిల్స్ తనకు అస్సలు నచ్చలేదని ఆమె చెప్పారని సమాచారం.తన కొడుకు సినిమాలకు సాఫ్ట్ టైటిల్స్ మాత్రమే బాగుంటాయని చిరంజీవి తల్లి చెప్పేవారట.అయితే కథను బట్టి టైటిల్స్ ను ఫిక్స్ చేస్తారు కాబట్టి చిరంజీవి టైటిల్స్ విషయంలో జోక్యం చేసుకునే వారు కాదు.ఆచార్య సినిమా అక్టోబర్ నెలలో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Telugu Acharya, Anjana Devi, Kajal Agrawal, Koratala Shiva, Rakshashudu, Ramchar

చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆచార్య లాంటి టైటిల్స్ అరుదుగా కుదురుతాయని చెప్పుకొచ్చారు.చిరంజీవి, చరణ్ కాంబోలో గతంలోనే కొన్ని సినిమాలు వచ్చాయి.అయితే ఆ సినిమాలలో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.ఆచార్య సినిమాలో చిరంజీవి, చరణ్ పాత్రలు ఫుల్ లెంగ్త్ రోల్స్ కాగా చరణ్ సెకండాఫ్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

కొరటాల శివ చరణ్ కాంబోలో కొన్నేళ్ల క్రితం ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube