పెళ్లికి ముందు మీనాకు భర్త షరతులు పెట్టారా.. షాకింగ్ విషయాలు రివీల్!

ఈ మధ్య కాలంలో మీనా పరిమితంగా సినిమాలలో నటిస్తుండటంతో సోషల్ మీడియాలో కానీ వెబ్ మీడియాలో కానీ ఆమె గురించి ఎక్కువగా చర్చ జరగడం లేదు.అయితే మీనా భర్త విద్యాసాగర్ తాజాగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల వల్ల మృతి చెందారనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Meena And Her Husband Details Here , Meena , Husband , Passed Away ,vidyasagar, Marrege , Tollywood-TeluguStop.com

మీనా భర్త మరణించిన తర్వాత ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మీనా విద్యాసాగర్ దంపతులకు ఒక కూతురు మాత్రమే ఉన్నారనే సంగతి తెలిసిందే.

మీనా విద్యాసాగర్ దంపతుల కూతురు పేరు నైనిక అని తెలిసిందే.అయితే మీనా విద్యాసాగర్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

 Interesting Facts About Meena And Her Husband Details Here , Meena , Husband , Passed Away ,vidyasagar, Marrege , Tollywood-పెళ్లికి ముందు మీనాకు భర్త షరతులు పెట్టారా.. షాకింగ్ విషయాలు రివీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీనా భర్త సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు.మీనా, విద్యాసాగర్ ల పెళ్లి కూడా గ్రాండ్ గా జరగలేదని తెలుస్తోంది.మీనా బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టగా నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.1990 సంవత్సరం నుంచి మీనా హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.

తెలుగులో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలకు జోడీగా నటించిన హీరోయిన్లలో మీనా కూడా ఒకరు కావడం గమనార్హం.తల్లి నిర్ణయం ప్రకారమే విద్యాసాగర్ తో మీనా వివాహం జరిగిందని సమాచారం.విద్యాసాగర్ తో పెళ్లికి ముందే చాలా సంవత్సరాల నుంచి మీనాకు పరిచయం ఉంది.స్నేహితులు అయిన మీనా విద్యాసాగర్ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు.పెళ్లికి ముందు భర్త మీనాకు కండీషన్లు పెట్టారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే ఒక సందర్భంలో మీనా ఈ వార్తల గురించి స్పందిస్తూ వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు.

భర్తతో ఉండాలని పెళ్లైన తర్వాత కొంతకాలం సినిమాలకు తాను దూరంగా ఉన్నానని పాపతో సమయం కేటాయించడానికి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని ఆమె తెలిపారు.భర్త తనకు ఎలాంటి షరతులు విధించలేదని ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube