వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం చేయడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం, తన పసుపు కుంకుమలను కాపాడుకోవటం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు.ఈ విధమైనటువంటి అన్ని నోములలో కెల్లా మంగళగౌరీ వ్రతం ఎంతో శుభప్రదమైనది.

 Interesting Facts About Mangala Gowri Vratham-TeluguStop.com

పెళ్లైన స్త్రీలు శ్రావణమాసంలో తొలి మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం చేయటం వల్ల పది కాలాల పాటు సౌభాగ్యవతిగా ఉంటుందని భావిస్తారు.అయితే ఈ విధంగా మంగళగౌరీ వ్రతం చేయటం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

అది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 Interesting Facts About Mangala Gowri Vratham-వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం చేయడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తారు.

ఈ విధంగా క్షీరసాగరమధనం చేసే సమయంలో సముద్రగర్భం నుంచి కాలకూట విషం ఉద్భవిస్తుంది.ఈ విషం సేవిస్తే కాని సముద్రం నుంచి అమృతం రాదు.

ఈ భయంకరమైన పరిస్థితులలో దేవదానవులు ఇద్దరు పరమేశ్వరుని వేడుకోగా తన తదుపరి కర్తవ్యం ఏమిటో సెలవివ్వలసిందిగా పరమేశ్వరుడు పార్వతీ వంక చూశాడు.

పరమేశ్వరుడి ఆంతర్యం గ్రహించిన పార్వతీదేవి బిడ్డల యోగక్షేమాలను కాంక్షించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ తన సౌభాగ్యం పై ఎంతో నమ్మకం ఉంచి పరమేశ్వరుడు కాలకూట విషాన్ని సేవించడానికి అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

అంతట త్యాగమూర్తి అయిన పార్వతీదేవిని సర్వమంగళ స్వరూపిణి పేరిట కొత్తగా వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంతో వర్ధిల్లుతారని పండితులు తెలియజేస్తున్నారు.అయితే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసం తొలి మంగళవారం ఆచరించాలి.

ఈ విధంగా 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతం ఆచరించిన వారికి వైధవ్య బాధలు లేకుండా జీవితాంతం సర్వసౌఖ్యాలతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి.

#Married Womens #MangalaGowri #Pooja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU