మహానటి సావిత్రి స్థాపించిన ఈ పాఠశాల గురించి మీకు తెలుసా?

Interesting Facts About Mahanati Savitri School

తెలుగు, తమిళ భాషల్లో నటిగా, దర్శకురాలిగా సావిత్రి పాపులారిటీని సొంతం చేసుకున్నారనే విషయం తెలిసిందే.తన నటన ద్వారా సావిత్రి అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడ్డారు.

 Interesting Facts About Mahanati Savitri School-TeluguStop.com

బాల్యంలోనే సావిత్రి తండ్రిని పోగొట్టుకున్నారు.బాల్యం నుంచే కళపై ఆసక్తి ఉన్న సావిత్రి చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

అర్థికపరమైన ఇబ్బందులు ఎదురు కావడంతో చివరి దశలో సావిత్రి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 Interesting Facts About Mahanati Savitri School-మహానటి సావిత్రి స్థాపించిన ఈ పాఠశాల గురించి మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో సావిత్రి ఎక్కువగా నటించారు.

తమిళ సినిమాలు కూడా సావిత్రికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.మాయాబజార్ సినిమా నటిగా ఆమెకు పేరుప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.1981 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీన సావిత్రి మృతి చెందారు.సావిత్రిది ఎడమచేతి వాటం అనే సంగతి తెలిసిందే.

సావిత్రి మల్లెపూలు, వర్షంను ఎంతగానో ఇష్టపడేవారు.దానధర్మాల విషయంలో సావిత్రిది ఎముక లేని చెయ్యి కావడం గమనార్హం.

దాతృత్వంలో తనకు ఎవ్వరూ సాటిరారని సావిత్రి ప్రూవ్ చేశారు.సావిత్రి రేపల్లె అనే మండలంలో పాఠశాలను స్టార్ట్ చేసి విద్యాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు.సావిత్రి అమ్మది రేపల్లె మండలంలోని వడ్డివారి పాలెం గ్రామం కాగా తల్లి, పెద్దమ్మ కోరిక మేరకు సావిత్రి పాఠశాలను నిర్మించారు.పేద విద్యార్థులకు విద్యను అందించాలనే ఆలోచనతో ఈ పాఠశాల మొదలైంది.

పాఠశాల విద్య, సాంస్కృతిక, క్రీడా అంశాలకు సంబంధించి కార్పొరేట్ పాఠశాలలకు గట్టి పోటీ ఇస్తోంది.

గత 11 సంవత్సరాలుగా ఈ పాఠశాల నూటికి నూరు శాతం ఫలితాలను అందుకుంటోంది.ఈ పాఠశాలలో చదివిన చాలామంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగారు.ఒకానొక సందర్భంలో ఈ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి ఏర్పడితే సావిత్రి తన సొంత డబ్బు 1,04,000 రూపాయలు ఇచ్చారు.

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి సినిమా నిర్మాతలు ఈ స్కూల్ కోసం బస్సును డొనేట్ చేశారు.

#Repalla #Savitri School #School

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube