జనవరి 14వ తేదీకి నాగార్జునకు ఉన్న లింక్ ఏంటో తెలుసా?

Interesting Facts About Link Between Nagarjuna And January 14

స్టార్ హీరో నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా తొలిరోజే ఏకంగా 17.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో నాగ్ సంతోషిస్తున్నారు.తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా అన్నపూర్ణ స్టూడియోస్ లో బంగార్రాజు సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలు కూడా జరిగాయి.

 Interesting Facts About Link Between Nagarjuna And January 14-TeluguStop.com

ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ జనవరి 14వ తేదీన తన తల్లి అక్కినేని అన్నపూర్ణ పుట్టినరోజు అని తెలిపారు.నాన్న అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయని నాగార్జున చెప్పుకొచ్చారు.

ఈ కారణం వల్లే జనవరి 14వ తేదీన బంగార్రాజు సినిమాను విడుదల చేశామని నాగ్ అన్నారు.నాన్నగారు నటించిన దసరా బుల్లోడు సినిమా కూడా సంక్రాంతికే విడుదలైందని నాగార్జున కామెంట్లు చేశారు.

 Interesting Facts About Link Between Nagarjuna And January 14-జనవరి 14వ తేదీకి నాగార్జునకు ఉన్న లింక్ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు సినిమాను నిర్మించాయి.

Telugu Akhil, Akkineni, Annapurna, Bangarraju, Dasara Bullodu, January, Naga Chaitanya, Nagarjuna-Movie

జీ స్టూడియోస్ తో ఉన్న ఒప్పందం వల్లే నాగార్జున సంక్రాంతి పండుగకు ఈ సినిమాను ఖచ్చితంగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యి సినిమాను రిలీజ్ చేశారని సమాచారం.ఏపీ టికెట్ రేట్ల అంశం గురించి కూడా నాగార్జున స్పందించారు.సీఎం జగన్ ను కలవడానికి చిరంజీవి వెళ్లారంటే సమస్యకు హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనని నాగ్ అభిప్రాయపడ్డారు.

Telugu Akhil, Akkineni, Annapurna, Bangarraju, Dasara Bullodu, January, Naga Chaitanya, Nagarjuna-Movie

సినీ ప్రముఖులు ఆశించిన విధంగానే ఏపీలో టికెట్ రేట్లు ఫిక్స్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా ఇతర రాష్ట్రాల స్థాయిలో మాత్రం పెరగడం అసాధ్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.బంగార్రాజు సక్సెస్ తో నాగార్జున సంతోషిస్తున్నారు.2022 సంవత్సరం కూడా అక్కినేని హీరోలకు కలిసొచ్చిందనే చెప్పాలి.గతేడాది నాగచైతన్య, అఖిల్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

#Bangarraju #Dasara Bullodu #Akkineni #Naga Chaitanya #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube