టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అంటే ఎక్కువమందికి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గుర్తుకొస్తారు.అయితే ఆనీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ గా మంచి పేరును సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆనీ మాస్టర్ బిగ్ బాస్ సీజన్5లో కంటెస్టెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.ఆనీ మాస్టర్ టాప్5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలుస్తారని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆనీ మాస్టర్ దాదాపు 17 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.
కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్ గా, మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఆనీ మాస్టర్ పని చేశారు.
ఆనీ మాస్టర్ పేరెంట్స్ నేపాల్ కు చెందినవారు కాగా ఆనీ మాస్టర్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు.జెమినీ ఛానల్ లో ప్రసారమైన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షోలో కూడా ఆనీ మాస్టర్ పాల్గొనడం గమనార్హం.
ఆనీ మాస్టర్ స్కూల్ లో చదివే సమయంలోనే ఆమెకు డ్యాన్స్ పై మక్కువ ఎక్కువగా ఉండేది.
స్కూల్ లో ఆనీ మాస్టర్ ఎన్నో డ్యాన్స్ పర్ఫామెన్స్ లు ఇచ్చారు.
సోలో కొరియోగ్రాఫర్ గా నా పేరు కాంచనమాల సినిమాలో ఆనీ మాస్టర్ కు తొలి సినిమా కాగా పైసా వసూల్ సినిమా ఆనీ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ గా మంచి పేరును తెచ్చిపెట్టింది.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ పిల్లా సుభానల్లా పాటకు కూడా ఆనీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ ఆనీ మాస్టర్ యొక్క తొలి గురువు కావడం గమనార్హం.
ఆనీ మాస్టర్ వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాగా ఆమె వయస్సు కేవలం 26 అని తప్పుగా ప్రచారం జరుగుతోంది.బిగ్ బాస్ హౌస్ లో మిగతా కంటెస్టెంట్లకు ఆనీ మాస్టర్ గట్టి పోటీ ఇస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో చాలామందికి ఆనీ మాస్టర్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉండటం గమనార్హం.