వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఈ ఏడాది విడుదలైన క్రాక్, నాంది సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్.సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ ఎల్.

 Interesting Facts About Krack Movie Fame Varalakshmi Sharat Kumar-TeluguStop.com

ఎల్.బీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ కు తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు.అయితే క్రాక్ సినిమాలో జయమ్మ రోల్ లో వరలక్ష్మి అద్భుతంగా నటించారు.శరత్ కుమార్ కూతురు అయినప్పటికీ వరలక్ష్మీ కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన బాయ్స్ సినిమాలో ఒక పాత్రలో నటించే ఛాన్స్ వరలక్ష్మికి రాగా అడిషన్ లో ఎంపికైనా తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆమె ఆ సినిమాలో నటించలేదు.ప్రేమిస్తేసినిమాలో కూడా వరలక్ష్మికి హీరోయిన్ గా ఛాన్స్ దక్కినా ఆ ఆఫర్ ను కూడా కొన్ని కారణాల వల్ల ఆమె వదులుకున్నారు.

 Interesting Facts About Krack Movie Fame Varalakshmi Sharat Kumar-వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ నటుడి కూతురు అయినప్పటికీ వరలక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

కోలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖులు వరలక్ష్మితో అసభ్యంగా ప్రవర్తించారు.

అయితే వరలక్ష్మి ఆమెకు ఎదురైన ఇబ్బందుల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు.నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయాలని సినిమాల్లో మన పని మనం సరిగ్గా చేస్తే మంచి ఫలితం వస్తుందని ఆమె అన్నారు.

శింబు హీరోగా నటించిన పోడా పోడీ సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానం మరో లెవెల్ లో ఉందని ఆమె అన్నారు.

Telugu Interesting Facts, Krack Movie, Nandi, Varalaxmi Sarat Kumar-Movie

రాధిక, తాను సరదాగా ఉంటామని తన సినిమాలను చూసి రాధిక అప్పుడప్పుడూ అభిప్రాయాలను చెబుతుండని వరలక్ష్మి చెప్పారు.వరలక్ష్మికి ఒక తమ్ముడు ఉండగా ఇద్దరు సోదరులు ఉన్నారు.సేవ్ శక్తి పేరుతో వీధి కుక్కలను కాపాడటం కొరకు వరలక్ష్మి ఒక సంస్థను ప్రారంభించారు.

#VaralaxmiSarat #Nandi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు