కింగ్ నాగార్జునను యాక్షన్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదో తెలుసా?

ఆరు పదుల వయస్సులో కూడా అక్కినేని నాగార్జున యాక్టివ్ గా ఉంటూ సినిమాల ద్వారా ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.2022 సంక్రాంతి రేసులో నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ కూడా ఉండనుందని తెలుస్తోంది.తక్కువ సంఖ్యలో థియేటర్లు దొరికినా బంగార్రాజు సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నారు.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే గతంలో సోగ్గాడే చిన్నినాయన సాధించిన విధంగా ఈ సినిమాకు కూడా భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

 Interesting Facts About King Nagarjuna Aakhari Poratam Movie , Aakhari Poratam,-TeluguStop.com

అయితే సంక్రాంతికి మూడు భారీ సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున ఏ మేరకు సత్తా చాటుతారో చూడాల్సి ఉంది.అయితే నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నోసినిమాల్లో నటించినా నాగార్జునను యాక్షన్ హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం ఆఖరి పోరాటం సినిమా అని చెప్పవచ్చు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.

కె.

రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘనవిజయం సాధించింది.ఈ సినిమాకు ముందు నాగ్ కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ప్రేమకథా చిత్రాలు కావడం గమనార్హం.

యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించారు.శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమా కోసం శ్రీదేవి అప్పట్లోనే 12 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారు.

ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ హిట్ అయ్యాయి.కేవలం 65 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా మొదట నెగిటివ్ టాక్ వచ్చినా తర్వాత పుంజుకుంది.35 కేంద్రాలలో ఈ సినిమా 100 రోజులు ఆడింది.నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube