కేజీఎఫ్ హీరో యశ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యశ్ కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమా ద్వారా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.ఈ నెల 7వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ విడుదల కాగా ఈ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

 Interesting Facts About Kgf Movie Hero Yash, Hero Yash, Kgf Movie,yash Biogrpa-TeluguStop.com

త్వరలో కేజీఎఫ్ 2 సినిమా విడుదల కానుండగా ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.? అని ఎదురుచూస్తున్నారు.తన సినిమా ద్వారా 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి హీరోగా యశ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.1986వ సంవత్సరం జనవరి 8వ తేదీన హసన్ జిల్లాలోని చిన్న టౌన్ లో యశ్ జన్మించారు.చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న యశ్ చదువు పూర్తైన వెంటనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.

యశ్ తండ్రి ఆర్టీసీ బస్ డ్రైవర్ గా పని చేసే వారు.అయితే సినిమాలలో ఛాన్సుల కోసం ప్రయత్నించిన యశ్ కు సీరియల్స్ లో అవకాశాలు రాగా కెరీర్ మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించారు.

Telugu Yash, Kgf Yash, Kgf, Yash Biogrpahy-Movie

హీరో కావాలనే కోరిక బలంగా ఉన్నా తొలుత యశ్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు.ఆ పాత్రల ద్వారా వచ్చిన పేరు, గుర్తింపు వల్ల యశ్ కు హీరోగా అవకాశాలు వచ్చాయి.మోగ్గినా మనస్సు అనే సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన యశ్ కు తొలి సినిమాతోనే మంచి ఫలితం దక్కింది.తొలి సినిమాలో యశ్ కు జోడీగా రాధిక హీరోయిన్ గా నటించగా ఆమెనే యశ్ ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

Telugu Yash, Kgf Yash, Kgf, Yash Biogrpahy-Movie

యశ్, రాధిక దంపతులకు ఇద్దరు సంతానం.యశ్ రాధికల కూతురు పేరు ఐరా కాగా కొడుకు పేరు అథర్వ్.కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అంచనాలను మించిన కలెక్షన్లు సాధించింది.కెరీర్ మొదట్లో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న యశ్ ప్రస్తుతం సినిమాకు 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకుంటున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube