జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా?

చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లను పరిశీలిస్తే ఆ సినిమాలలో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.ప్రముఖ దర్శకులలో ఒకరైన కె.

 Interesting Facts About Jagadeka Veerudu Atiloka Sundari Movie, Interesting Fact-TeluguStop.com

రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సోషియో ఫాంటసీ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది.

రాఘవేంద్ర రావు, జంధ్యాల కలిసి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చారు.

ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా ద్వారా అశ్వనీదత్ కు భారీగా లాభాలు వచ్చాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.ఈ సినిమా రిలీజై 31 సంవత్సరాలు పూర్తైనా బుల్లితెరపై ఇప్పటికీ ఈ సినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎన్నో సంచలనాలను సృష్టించింది.

Telugu Lakhs Rupees, Chiranjeevi, Jagadekaverrudu, Jandyala, Raghavendra Rao, Sr

ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి 35 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు.స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమా కోసం పాతిక లక్షలు తీసుకున్నారు.బాలీవుడ్ లో కూడా శ్రీదేవికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో చిరంజీవి స్థాయిలోనే శ్రీదేవి కూడా ఈ సినిమా కోసం పారితోషికం తీసుకున్నారు.

ఈ సినిమా ద్వారా నిర్మాతకు 35 లక్షల రూపాయల లాభం వచ్చింది.

Telugu Lakhs Rupees, Chiranjeevi, Jagadekaverrudu, Jandyala, Raghavendra Rao, Sr

ప్రస్తుతం 35 లక్షలు అంటే ఎక్కువ మొత్తం కాకపోయినా మూడు దశాబ్దాల క్రితం 35 లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తమని చెప్పవచ్చు.ఈ సినిమా 7 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా ఆ సమయంలో బాల్కనీ టికెట్ ధర కేవలం 6 రూపాయలుగా ఉండేది.ఒక సందర్భంలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవర్ క్లాసిక్ సినిమా అని చెప్పుకొచ్చారు.

చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube