దేశభక్తి ప్రధానంగా తెరకెక్కి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమాలివే?

ఈ మధ్య కాలంలో దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే.దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన తొలి సినిమా ప్రేమ విజయం అనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Independence Backdrop Movies Details, Major, Rrr , Indep-TeluguStop.com

దేవత, సుమంగళి, వందేమాతరం, రైతుబిడ్డ, మళ్లీ పెళ్లి, మాల పిల్ల సినిమాలు దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం.దేశానికి స్వాతంత్రం రాకముందే దేశభక్తి ప్రధానంగా పలు సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.

కృష్ణ హీరోగా తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు, శివాజీ గణేషన్ నటించిన వీర పాండ్య కట్ట బొమ్మన్, విజయ్ చందర్ నటించిన ఆంధ్రకేసరి, చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు అనే సంగతి తెలిసిందే.దేశభక్తిని చాటుతూ కమల్ హాసన్ భారతీయుడు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నో సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

రోజా, ఖడ్గం, ఘాజీ ఎటాక్, మహాత్మ, ఉరి, సీతారామం సినిమాలు కూడా దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం.

మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నా దేశం నమోనమామి వెలుగు నీడలు సినిమాలోని పాడవోయి భారతీయుడా పాటలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Telugu Andhra Kesari, Bharateeyudu, Independenceday, Khadgam, Mahatma, Chandraka

సినిమా పాటలైన నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ నా ఇల్లు అందులో చక్కని ప్రదేశమూ పాటలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.దేశభక్తి ప్రధానంగా తెరకెక్కి ఈ ఏడాది విడుదలైన మేజర్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu Andhra Kesari, Bharateeyudu, Independenceday, Khadgam, Mahatma, Chandraka

దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు మాత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడంలో ఫెయిలవుతున్నాయి.కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడం కూడా ఈ సినిమాలలో చాలా సినిమాల ఫెయిల్యూర్ కు కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube