స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో ఆ సమస్యలు.. చెట్టుతో పెళ్లంటూ?

Interesting Facts About Heroine Nayanatara Marriage

స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.భారీస్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే నయనతార లేడీ సూపర్ స్టార్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Interesting Facts About Heroine Nayanatara Marriage-TeluguStop.com

ప్రస్తుతం నయనతార చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు ఉన్నాయి.ఇప్పటికే విఘ్నేష్ శివన్ తో ఎంగేజ్ మెంట్ ను పూర్తి చేసుకున్న నయనతార త్వరలో విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోనున్నారు.

ప్రస్తుతం నయనతార వయస్సు 36 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Heroine Nayanatara Marriage-స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో ఆ సమస్యలు.. చెట్టుతో పెళ్లంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నయనతార స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ ను, పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్ గుడులు, గోపురాల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు.అయితే నయనతార జాతకంలో కుజ దోషం ఉంది.అందువల్ల నయనతార విఘ్నేష్ శివన్ కంటే ముందు చెట్టుకును పెళ్లి చేసుకోవాలని జ్యోతిష్కులు చెప్పినట్టు తెలుస్తోంది.

జ్యోతిష్కులు చెప్పిన సలహాలను, సూచనలను పాటిస్తానని నయనతార చెప్పినట్టు తెలుస్తోంది.

విఘ్నేష్ శివన్ పెళ్లి తర్వాత కూడా క్షేమంగా ఉండాలనే ఆలోచనతో జ్యోతిష్కుల సూచనల మేరకు నయనతార ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.తాజాగా విఘ్నేష్ నయన్ శ్రీవారిని, షిరిడి సాయిబాబాను, సిద్ధి వినాయక్ టెంపుల్ ను, వరలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు.

Telugu Interesting Facts, Marriage, Nayanatara, Vighnesh Shivan-Movie

గతంలో ఐశ్వర్యా రాయ్ కూడా మొదట చెట్టును పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు.ఐశ్వర్యా రాయ్ చెట్టును పెళ్లి చేసుకోవడం గురించి జోరుగా చర్చ జరిగింది.అయితే నయనతారకు చెట్టుతో పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఆమె ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

నయనతార కూడా ఇలాంటివి నమ్ముతారా? అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Nayanatara #Vighnesh Shivan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube