బాలయ్య, నాగ్, వెంకీలతో పోటీ పడి శ్రీకాంత్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఏదో తెలుసా?

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారనే సంగతి తెలిసిందే.ఈ హీరోల సినిమాలు రిలీజయ్యాయంటే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి.1996 సంవత్సరంలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడ్డారు.అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ ముగ్గురు హీరోల సినిమాలు కాకుండా శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన చిన్నసినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

 Interesting Facts About Hero Srikanth Pelli Sandadi Movie-TeluguStop.com

1996వ సంవత్సరం జనవరి నెల 5వ తేదీన బాలకృష్ణ హీరోగా నటించిన శరత్ డైరెక్షన్ లో రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించిన వంశానికొక్కడు సినిమా విడుదలైంది.వంశానికొక్కడు సినిమాకు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

జనవరి 5వ తేదీన వంశానికొక్కడు సినిమాతో పాటు నాగార్జున హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన వజ్రం సినిమా కూడా విడుదలైంది.

 Interesting Facts About Hero Srikanth Pelli Sandadi Movie-బాలయ్య, నాగ్, వెంకీలతో పోటీ పడి శ్రీకాంత్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వజ్రం సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

ఈ సినిమాలు రిలీజైన వారం రోజుల తర్వాత సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ధర్మచక్రం అనే సినిమా విడుదలైంది.ధర్మచక్రం సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే జనవరి 12వ తేదీన కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో స్టార్ ఇమేజ్ లేని శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా విడుదలైంది.

పెళ్లి సందడి మూవీ స్లో టాక్ తో మొదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పెళ్లి సందడి ఏకంగా 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. బాలయ్య, నాగ్, వెంకీలతో పోటీ పడి శ్రీకాంత్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

#Dharmachakram #Vamsanikokkadu #Block Buster #Sriakanth #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు