జయం మూవీని మిస్సైన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో నితిన్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలై నేటికి 19 సంవత్సరాలైంది.2002లో రిలీజైన ఈ సినిమా హీరో నితిన్, హీరోయిన్ సదాతో పాటు ఎంతోమంది కమెడియన్ల కెరీర్ లను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.కేవలం కోటీ 80 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి.

కేవలం 65 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది.అయితే ఈ సినిమాలో హీరోగా మెగ హీరో అల్లు అర్జున్ ను కూడా పరిశీలించారని సమాచారం.

 Interesting Facts About Hero Nithin Jayam Movie-జయం మూవీని మిస్సైన స్టార్ హీరో ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లు అరవింద్ జయం సినిమాతో తన కొడుకును హీరోను చేయాలనే ఆ ప్రయత్నాలు చేయగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను అల్లు అర్జున్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది.ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకైన నితిన్ అడిషన్స్ లో అద్భుతంగా చేసి హీరోగా సెలెక్ట్ అయ్యారు.,/br>

మొదట ఈ సినిమాలో విలన్ రోల్ కోసం తేజ్ బాలీవుడ్ యాక్టర్ ను ఎంపిక చేయగా అతని నటన నచ్చకపోవడంతో ఆ తరువాత గోపీచంద్ కు విలన్ రోల్ లో నటించే ఛాన్స్ వచ్చింది.ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించగా పాటలు ఈ సినిమాకు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.కేవలం 50 ప్రింట్లతో జయం రిలీజ్ కాగా ప్రింట్ల సంఖ్య క్రమంగా పెరిగింది.థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లను సాధించి ఈ సినిమా నితిన్, సదాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమాతో పరిచయమై ఉంటే అల్లు అర్జున్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయ్యి ఉండేది.ఆ తరువాత అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ పరిచయం కావడం ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం మనందరికీ తెలిసిందే.

#Allu Arjun #Nithin #Allu Aravind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు