మంచు విష్ణు భార్య గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా 107 ఓట్ల మెజారిటీతో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే.మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రధానంగా మంచు విష్ణు గెలుపుకు కారణమయ్యాయని చెప్పవచ్చు.

 Interesting Facts About Hero Manchu Vishnu Wife Viranica Reddy Details, Cm Jagan-TeluguStop.com

సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దాదాపు రెండు దశాబ్దాల నుంచి విష్ణు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విష్ణు త్వరలో ఢీ అండ్ ఢీ షూటింగ్ లో పాల్గొననున్నారు.పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన విష్ణు నిర్మాతగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

మరోవైపు విష్ణు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తుండటం గమనార్హం.మంచు విష్ణు భార్య పేరు విరనికా రెడ్డి అనే సంగతి తెలిసిందే.

విరనికా రెడ్డి సీఎం జగన్ కు వరుసకు చెల్లి అవుతారు.

వైఎస్ రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి కూతురు విరనికా రెడ్డి.

Telugu Viranica Reddy, Cm Jagan, Manchu Vishnu, Manchuvishnu, Viranica, Ys Jagan

అమెరికాలోనే పుట్టి పెరిగిన విరనికా రెడ్డి తర్వాత కాలంలో ఇండియాకు వచ్చారు.మంచు విష్ణు, విరనికా ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.విరనికా కుటుంబానికి ఆఫ్రికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయి.విష్ణు విరనికా దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.

Telugu Viranica Reddy, Cm Jagan, Manchu Vishnu, Manchuvishnu, Viranica, Ys Jagan

సోషల్ మీడియాలో విష్ణు యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే విరనికా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి అస్సలు ఇష్టపడరు.కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే విరనికా భర్త చాటు భార్యగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు.బాల్యంలో విరనికా రెడ్డి డాక్టర్ కావాలని అనుకున్నారు.పాలిటిక్స్, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఈ రెండు రంగాలపై విరనికా రెడ్డి పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube