ఒక్క ఫైట్ లేదు.. డ్యాన్స్ స్టెప్పు లేదు.. అయినా హిట్టైన బాలకృష్ణ సినిమా ఇదే!

Interesting Facts About Hero Balakrishna Nari Nari Naduma Murari Movie

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్ అభిమానాన్ని పొందుతున్న హీరోలలో స్టార్ హీరో బాలకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే.బాలకృష్ణ సినిమా అంటే అదిరిపోయే పంచ్ డైలాగ్స్, ఊరమాస్ ఫైట్స్ ఉంటాయి.

 Interesting Facts About Hero Balakrishna Nari Nari Naduma Murari Movie-TeluguStop.com

సక్సెస్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు బాలకృష్ణతో సినిమాను తెరకెక్కించాలని తెగ ఆసక్తి చూపిస్తున్నారు.అయితే బాలకృష్ణ నటించిన ఒక్క సినిమాలో మాత్రం ఫైట్లతో పాటు ప్రేక్షకులను మెప్పించే డ్యాన్స్ స్టెప్పులు లేవు.

బాలయ్య హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో నారీనారీ నడుమ మురారి సినిమా ఒకటని చెప్పవచ్చు.బాలకృష్ణ నటన, కథ వల్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Interesting Facts About Hero Balakrishna Nari Nari Naduma Murari Movie-ఒక్క ఫైట్ లేదు.. డ్యాన్స్ స్టెప్పు లేదు.. అయినా హిట్టైన బాలకృష్ణ సినిమా ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో అత్తా అల్లుళ్ల టీజింగ్ డ్రామాగా నారీనారీ నడుమ మురారి సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.యువచిత్ర పతాకం బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మురారి నిర్మాతగా వ్యవహరించారు.

విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా ఈ మూవీకి కథారచయితలుగా పని చేశారు.

Telugu Balakrishna, Director Kodanda Rami Reddy, Interesting Facts, Jandhyala, Nari Nari Naduma Murari, Nirosha, No Fights No Dance Movie, Shobhana, Tollywood-Movie

శోభన, నిరోషాసినిమాలో హీరోయిన్లుగా నటించగా బాలయ్య నటన, కథ వల్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.తమిళనాడు రాష్ట్రంలోని వేలచ్చేరి అనే ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరిగింది.1990 సంవత్సరంలో ఏప్రిల్ నెల 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావడం గమనార్హం.

Telugu Balakrishna, Director Kodanda Rami Reddy, Interesting Facts, Jandhyala, Nari Nari Naduma Murari, Nirosha, No Fights No Dance Movie, Shobhana, Tollywood-Movie

సినిమా టీవీలో ప్రసారమైతే ఇప్పటికీ మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఫైట్లు, డ్యాన్స్ స్టెప్పులు లేకపోయినా బాలయ్య మాత్రం బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామికి జంధ్యాల డబ్బింగ్ చెప్పారు.

#Balakrishna #Fights #Jandhyala #Nirosha #Shobhana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube