గోమాతను కొలిస్తే.. సకల దేవతలను పూజించినట్లేనా?

హిందువులు ఆవును గోమాతగా పిల్చుకుంటారు.సకల దేవతలు ఒక్క ఆవులోనే కొలువై ఉందనేది వారి నమ్మకం.

 Interesting Facts About Gomatha, Gomatha , Cow , Pooja , Devotional , Gods ,-TeluguStop.com

అందుకే ఆవును మాత అంటూ తల్లి స్థానాన్ని ఇచ్చారు.గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు.

యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు.కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేస్తారు.

గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.

ఎక్కడెక్కడ ఏయే దేవుళ్లు

గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట.

అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే, త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.అంతేకాకుండా.

శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ, బిళ్వ దళాలతో పూజిస్తే, సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందట.గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం వుండదట.

ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారు.అందువల్ల చెవిని పూజిస్తే, సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట.

ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారు.వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయి.

ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతారు.అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే, విద్యాప్రాప్తి లభిస్తుంది.

ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని, కనుక వాటిని పూజిస్తే.యమబాధలుండవని చెప్తుంటారు.

అంతేకాకుండా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు.

Telugu Devotional, Gods, Gomatha, Govu, Pooja-Telugu Bhakthi

ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట.వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం.ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడట, అందువల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి.కనుక ఆ చోట పూజిస్తే… ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతారు.

ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట.వాటిని పూజిస్తే.

నాగలోక ప్రాప్తి లభిస్తుందని, భూమిపై నాగుపాముల భయం ఉండదని చెపుతారు.ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట.

కనుక గిట్టలను పూజిస్తే.గంధర్వలోక ప్రాప్తి.

గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట.ఆ భాగాన్ని పూజిస్తే, సఖ్యత, సౌందర్యం లభిస్తుందట.

అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube