ఆదివారం గరుడ భగవానుడిని పూజిస్తే..?

మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఎన్నో పూజలు చేస్తుంటాం.అదే విధంగా నిత్యం దేవాలయాలను సందర్శించి దేవ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటాం.

 Sunday, Pooja, Garuda Bhagavan, Lard Vishnu,hindu Sampradayam ,temple-TeluguStop.com

అయితే సోమవారం శివుడిని పూజిస్తే, మంగళవారం అమ్మవారిని, ఆంజనేయుని పూజిస్తూ ఉంటాము.అదేవిధంగా బుధవారం వినాయకుని పూజిస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు.

ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో దేవుని పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని భావిస్తారు.అయితే విష్ణుమూర్తి వాహనమైన గరుడ భగవానుడిని ఈరోజు దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

అవతార పురుషుడు మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనమైన గరుడ భగవానుడిని పూజించడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయి.ముఖ్యంగా శనివారం గరుడని పూజించడం వల్ల పుణ్య ఫలితాలు చేకూరుతాయి.

పక్షులకు రాజుగా ఉన్న గరుడ శనివారం రోజంతా ఎప్పుడైనా పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి పండితులు చెబుతున్నారు.అదేవిధంగా ఆదివారం ఈ గరుడని పూజిస్తే దీర్ఘకాలికంగా వెంటాడుతున్న వ్యాధులు తొలగిపోతాయి.

సోమ మంగళ వారాలలో గరుడ భగవానుడిని పూజించడం వల్ల ముఖ సౌందర్యం పెరగటమేకాకుండా మానసిక ఆందోళనల నుంచి విముక్తి కలిగిస్తుంది.బుధ, గురు వారాలలో గరుడని పూజిస్తే దుష్ట శక్తుల ప్రభావం నుంచి విముక్తి కలిగి ప్రశాంతత ఉంటుంది.

శుక్రవారం గరుడ పూజిస్తే దీర్ఘాయువుతో పాటు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.ఒకవేళ మనకు గరుడ భగవానుడు దర్శనం లభించకపోతే విష్ణు ఆలయాన్ని సందర్శించే ఈ ఆలయంలో ఉన్నటువంటి గరుడని పూజించవచ్చు.

అదేవిధంగా శనివారం సాయంత్రం విష్ణు ఆలయాన్ని సందర్శించి నేతితో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు సక్రమంగా నెరవేరుతాయని పండితులకు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube