సింగర్ మంగ్లీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

జానపద గేయాలు పాడటం ద్వారా లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు సింగర్ మంగ్లీ.అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తాండాలో జన్మించిన మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుని టెన్త్ క్లాస్ పాసైన తర్వాత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లో డిప్లొమా చేశారు.

 Interesting Unknown Facts About Folk  Singer Mangli , Interesting Facts, Love St-TeluguStop.com

సంగీతంలో మెలుకువలను నేర్చుకుని తెలంగాణ పల్లె పాటలు పాడటం ద్వారా మంగ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు.

చాలామంది మంగ్లీ భాష, పాటలను చూసి ఆమె తెలంగాణకు చెందిన వ్యక్తి అని భావిస్తారు.

మంగ్లీ అసలు పేరు సత్యవతి కాగా యాంకర్ అయిన తర్వాత ఛానెల్ సూచనల మేరకు ఆమె పేరును మార్చుకున్నారు.మంగ్లీ అనే పేరుతోనే ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు.

మంగ్లీ పాడిన కొన్ని పాటలు యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ తెచ్చుకుంటే మరికొన్ని పాటలు లక్షల్లో వ్యూస్ సంపాదించుకున్నాయి.

Telugu Background, Folk, Love Story, Mangli, Saranga Dariya-Movie

తీన్మార్ న్యూస్ ప్రోగ్రామ్ కు మంగ్లీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.మంగ్లీ పాడిన లవ్ స్టోరీ మూవీలోని సారంగ దరియా పాట మూడు రోజుల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైంది.ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

మంగ్లీ పాడిన మరికొన్ని పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.శైలజా రెడ్డి అల్లుడు చూడె, భూమ్ బద్దల్, పైన పటారం లోన లొటారం పాటలు సింగర్ గా మంగ్లీకి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

ఫోక్ సాంగ్స్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు.మంగ్లీ పాడిన పాటలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

ఇప్పటికే స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ భవిష్యత్తులో మరిన్ని ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.మంగ్లీ యూట్యూబ్ ఛానెల్ కు లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube