సింగర్ కావాలని అనుకున్న సీతారామశాస్త్రి పాటల రచయితగా మారడానికి కారణాలివే?

Interesting Facts About Famous Lyricist Sirivennela Seetaramasastry Details Here

పాటల రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కోట్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో సిరివెన్నెల మాట్లాడుతూ భయం వెయ్యాలని అప్పట్లో నిగ్గదీసి అడుగు పాటను రాశానని ఇప్పుడు భయం మోతాదు మించిపోయిందని తెలిపారు.

 Interesting Facts About Famous Lyricist Sirivennela Seetaramasastry Details Here-TeluguStop.com

భయపడుతూ బ్రతకడం కంటే చచ్చి బ్రతికిపోదామని అనుకునే పరిస్థితి నెలకొందని సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పుకొచ్చారు.

నాన్న 15 భాషల్లో పాండిత్యం గల వ్యక్తి అని నాన్నకు రాని సబ్జెక్ట్ ఏదీ లేదని నాన్న పెద్ద కొడుకైన తనకు అన్నీ నేర్పించాలని భావించి అన్నీ చెప్పేవారని సీతారామశాస్త్రి తెలిపారు.

 Interesting Facts About Famous Lyricist Sirivennela Seetaramasastry Details Here-సింగర్ కావాలని అనుకున్న సీతారామశాస్త్రి పాటల రచయితగా మారడానికి కారణాలివే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే తన కెరీర్ కు ఉపయోగపడిందని ఆయన అన్నారు. జగమంత కుటుంబం అనే పాట పాట కాదని విజిటింగ్ కార్డ్ అని సిరివెన్నెల వెల్లడించారు.

తనది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని 14 నుంచి 15 మందికి నాన్నే ఆధారమని సిరివెన్నెల తెలిపారు.

నాన్న రోజుకు 19 గంటలు కష్టపడేవారని అప్పట్లో పీజీ చేసినా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదని సిరివెన్నెల పేర్కొన్నారు.ఎంబీబీఎస్ లో చేరినా ఆ క్రమశిక్షణ నాకు అలవాటు లేదని ఆ తర్వాత పది అర్హతతో టెలీకాం డిపార్టుమెంట్ లో జాబ్ వచ్చిందని సిరివెన్నెల తెలిపారు.మూవీ ఛాన్స్ వచ్చిన వచ్చిన సమయంలో సత్యారావు మాస్టార్ ఈ రంగంలోకి తోశారని ఆయన చెప్పుకొచ్చారు.

చిన్నప్పుడు బాగా పాడాలని కోరిక అని తనకు పెద్ద గాయకుడు అనే ఫీలింగ్ ఉండేదని సిరివెన్నెల చెప్పుకొచ్చారు.అయితే రెండు మూడుసార్లు పాడిన తర్వాత తాను సింగింగ్ కు పనికిరానని అర్థమైందని ఆయన తెలిపారు.

ఆ తర్వాత తమ్ముడు కవిత్వం బాగా రాస్తున్నావని ప్రోత్సహించాడని తాను రాసిన పాటలవిశ్వనాథ్ దృష్టిలో పడటంతో సినిమా ఛాన్స్ వచ్చిందని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు.కొన్నేళ్ల క్రితం సిరివెన్నెల చెప్పిన ఈ విషయాలను తలచుకుంటూ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube