శివశంకర్ మాస్టర్ జాతకంలో అలా రాసి ఉందట.. ఏం జరిగిందంటే?

నటుడిగా, కొరియోగ్రాఫర్ గా పాపులారిటీని సంపాదించుకున్న శివశంకర్ మాస్టర్ నిన్న రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందారు.శివశంకర్ మాస్టర్ మృతితో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 Interesting Facts About Famous Choreographer Shivashankar Master , Dancer , Famo-TeluguStop.com

సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు శివశంకర్ మాస్టర్ మృతికి సంతాపం తెలియజేశారు.గతంలో శివ శంకర్ మాస్టర్ ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒక కార్యక్రమంలో తాను ఎనర్జీగా ఉండటం పరమేశ్వరుడి దయ అని గురువుల ఆశీర్వాదం అని తల్లిదండ్రులు తనకు ఇచ్చిన బహుమతి అని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.నాన్న పండ్ల వ్యాపారి అని హోల్ సేల్ గా రాజమండ్రి, చుట్టుపక్కల గ్రామాలకు పండ్లను సరఫరా చేసేవారని శివ శంకర్ మాస్టర్ అన్నారు.16 సంవత్సరాల వయస్సులో తాను డ్యాన్స్ నేర్చుకుంటానని చెప్పానని పెద్దపెద్ద పండితులకు చూపిస్తే డ్యాన్సర్ అవుతాడు వదిలెయ్ అని నాన్నకు చెప్పారని శివశంకర్ మాస్టర్ తెలిపారు.

పాట్టు భరదము తాను సహాయకుడిగా చేసిన తొలి సినిమా అని మాస్టర్ గా కురివికూడు తొలి సినిమా అని శివశంకర్ మాస్టర్ అన్నారు.

టాలీవుడ్ లో ఖైదీ తొలి మూవీ అని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.తనకు ఇద్దరు అబ్బాయిలని పెద్దబ్బాయ్ పేరు విజయ్ శివశంకర్ చిన్నబ్బాయి పేరు అజయ్ శివశంకర్ అని మాస్టర్ తెలిపారు.

డైరెక్షన్ చేయడం తనకు ఇష్టం లేదని వయస్సు అంతకంతకూ పెరుగుతోందని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Telugu Choreographer, Shivashankar-Movie

పదికి పైగా భాషలలో సినిమాలకు నృత్యాలను సమకూర్చానని శివశంకర్ మాస్టర్ అన్నారు.15,000కు పైగా పాటలకు తాను కొరియోగ్రాఫర్ గా చేశానని కృష్ణ గారి సినిమాలకు తాను ఎక్కువగా ఎంపికయ్యానని మాస్టర్ చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ కు కోపం వస్తుందని తెలుసని ఏఎన్నార్ కోపగించుకోవడం చూడలేదని శివశంకర్ మాస్టర్ అన్నారు.

కొన్నేళ్ల క్రితం ప్రముఖ ఛానల్ కు గెస్ట్ గా హాజరైన సమయంలో శివశంకర్ మాస్టర్ ఈ విషయాలను వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube