కుక్క‌కి రెండు ముక్కులుంటాయా?.. గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు మీకోసం!

మీరు శున‌కాల‌ను పెంచుతున్నారా? శున‌కాలంటే మీకు ఇష్ట‌మా? లేదా శున‌కాల గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వివ‌రాలు మీ కోస‌మే.కుక్కల వాసనశ‌క్తి అమోఘంగా ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే! వాస్తవానికి, కుక్కల ముక్కు చాలా వింతగా ఉంటుంది.

 Interesting Facts About Dogs Two Noses Details, Dogs, Facts About Dog, Nose, Dog-TeluguStop.com

దాని ముక్కు మనుషుల ముక్కు క‌న్నా చాలా భిన్నంగా ఉంటుంది.కుక్క ముక్కుకు సంబంధించిన కొన్ని వాస్తవాలు నిజంగా ఆసక్తికరంగా అనిపిస్తాయి.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని నివేదికల ప్రకారం ఒక విధంగా చూస్తే కుక్కలకు రెండు ముక్కులు ఉంటాయి.

ఎందుకంటే అవి ముక్కులోని ఒక భాగంతో వాసన చూడటం, మ‌రొక‌ భాగం ద్వారా శ్వాస పీల్చుకోవ‌డం చేస్తాయి.కుక్కలు ముక్కులోని ఒక భాగం ద్వారా మాత్రమే ఊపిరి పీల్చుకుంటాయి.

అదే రంధ్రం ద్వారా శ్వాసను వదులుతాయి.వాసన చూడడానికి ప్రత్యేక అవయవాన్ని కలిగి ఉన్నందున వాటి వాసనశ‌క్తి భిన్నంగా ఉంటుంది.

Telugu Dog Sensors, Dogs, Dogs Nose, Dog, Nose, Noses-Latest News - Telugu

కుక్కలు మనుషుల కంటే మిలియన్ రెట్లు మెరుగైన వాసనశ‌క్తిని కలిగి ఉంటాయి.అవి త్రీడీ రూపంలో వాసన చూస్తాయి.ఇతర జంతువులు కుక్కల చుట్టూ ఉన్నప్పుడు కుక్కలు ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల ద్వారా ఉష్ణోగ్రతలో మార్పులను గుర్తించగలవని తాజా పరిశోధనలో తేలింది.ఈ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కుక్క ముక్కు కొనపై ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube